Ad Code

జనవరి 11 నుంచి రెడ్‌మీ నోట్ 12 సిరీస్ ఫోన్లు అమ్మకం !


దేశీయ మార్కెట్‌లోకి షియోమీ రెడ్‌మీ నోట్ సిరీస్ ఫోన్లు ఆవిష్కరించింది. రెడ్ మీ నోట్ 12 ఫోన్ ధర రూ.17,999లకు, రెడ్ మీ నోట్ 12 ప్రో ఫోన్ రూ.26,999లకు, రెడ్‌మీ నోట్ 12 ప్రో + ఫోన్ రూ. 29,999లకు లభిస్తాయి. భారత్‌లో ఆవిష్కరించిన రెడ్‌మీ సిరీస్ ఫోన్లలో ఇదే కాస్ట్‌లీ ఫోన్‌గా చెప్పవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుదారులకు బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు, బోనస్‌లు షియోమీ అందిస్తున్నది. ఈ మూడు ఫోన్లలోనూ 5జీ సేవలు లభ్యం అవుతాయి. రెడ్ మీ నోట్ సిరీస్ ఫోన్లలో 5జీ సేవలు అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి. జనవరి 11 నుంచి రెడ్‌మీ నోట్ 12 సిరీస్ ఫోన్ల విక్రయం ప్రారంభం అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ డాట్ కామ్‌, ఎంఐ హోమ్‌ల్లో ఈ ఫోన్లు లభిస్తాయి. దేశీయ టెలికం రంగంలో 5జీ కనెక్టివిటీ కోసం రిలయన్స్ జియోతో షియోమీ భాగస్వామిగా మారింది. రెడ్‌మీ నోట్ 12 బేస్ వేరియంట్ ఫోన్ భారత్ మార్కెట్‌లోనే ట్రిపుల్ కెమెరాతో వస్తున్నది. గ్లోబల్ వర్షన్ ఫోన్లలో 8 ఎంపీ కెపాసిటీ గల ఫ్రంట్ కెమెరా ఉండగా, భారత్‌లో విడుదల చేసే ఫోన్లలో 13 ఎంపీ సామర్థ్యం ఉంటుంది. రెడ్‌మీ నోట్ 12 ప్రో+ ఫోన్ 200 ఎంపీ కెమెరా, 120హెర్ట్జ్ డిస్‌ప్లే, 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నది.

Post a Comment

0 Comments

Close Menu