Ad Code

నోకియా సి12 స్మార్ట్ ఫోన్ విడుదల !


నోకియా నుండి మరొక ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఆకర్షణీయమైన డిజైన్, సింగల్ రియర్ కెమేరా మరియు Android 12 వంటి ఫీచర్లతో యూరప్ మార్కెట్ లో నోకియా విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఫీచర్లను కూడా అదే విధంగా కలిగి వుంటుంది. నోకియా సి12 స్మార్ట్ ఫోన్ 6.3 ఇంచ్ డిస్ప్లేని HD+ రిజల్యూషన్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది మరియు ఇందులో 5MP సెల్ఫీ కెమేరాతో ఉంటుంది. ఈ ఫోన్ Unisoc SC9863A ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. జతగా 2GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ ని కలిగి ఉంటుంది. Nokia C12 స్మార్ట్ ఫోన్ Android 12 (Go edition) OS పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక కేవలం 8MP సింగిల్ కెమేరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ 3,000mAh రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. ఇక ఇతర ఫీచర్ల పరంగా, 4G VoLTE, Wi Fi, బ్లూటూత్ 5.2, 3.5 mm ఆడియో జాక్ ను కలిగివుంది.


Post a Comment

0 Comments

Close Menu