Ad Code

త్వరలోనే ఐఫోన్ 14 ప్రో డిస్‌ప్లే సమస్యలకు పరిష్కారం ?


ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ డివైజ్‌లలో డిస్‌ప్లే సమస్యలను యాపిల్‌ కంపెనీ గుర్తించిందని, త్వరలోనే పరిష్కారం అందజేయనుందని సమాచారం. కొన్ని నెలల క్రితం ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ మొబైల్‌లను యాపిల్‌ రిలీజ్ చేసింది. అయితే ఈ ప్రో మోడళ్ల డిస్‌ప్లేలలో హారిజాంటల్‌ లైన్స్  కనిపించినట్లు గత నెలలో యూజర్లు రిపోర్ట్ చేశారు. ఫిర్యాదులపై దర్యాప్తు చేసిన యాపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్స్ ఆన్ చేస్తున్నప్పుడు కొంతమంది యూజర్లు తమ డిస్‌ప్లేలో యెల్లో కలర్ ఫ్లాషింగ్ లైన్స్‌ చూసి ఉంటారని కంపెనీ ధృవీకరించింది. ఈ డిస్‌ప్లే సమస్యను పరిష్కరించడానికి iOS సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోన్నట్లు ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్ వెల్లడించింది. యాపిల్ ఇంటర్నల్ డాక్యుమెంట్ ప్రకారం, సంస్థ తన ఐఫోన్ 14 ప్రోలోని డిస్‌ప్లే సమస్యలను పరిష్కరించేందుకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఫోన్‌ను ఆన్ చేసినప్పుడు లేదా అన్‌లాక్ చేసినప్పుడు స్క్రీన్‌పై హారిజాంటల్‌ లైన్స్ కనిపించడం అనేది ప్రధాన సమస్యగా కనుగొన్నది. దీన్ని ఫిక్స్ చేస్తూ కొత్త iOS అప్‌డేట్ 16.2.1 రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. మరోవైవు యాపిల్ ప్రస్తుతం iOS 16.3 పేరుతో ఐఫోన్ల కోసం కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై పని చేస్తోంది. ఈ అప్‌డేట్‌ని పబ్లిక్‌కి విడుదల చేయడానికి ముందు దీన్ని టెస్ట్ చేసే ముందు సైన్ అప్ చేసిన చేశారు. ప్రస్తుతం వీరు దానిని టెస్ట్ చేస్తున్నారు. యాపిల్ డెవలపర్లు కూడా ఈ అప్‌డేట్‌ను టెస్ట్ చేస్తున్నారు. అందువల్ల ఈ అప్‌డేట్ మరికొన్ని వారాల వరకు అందుబాటులో రాదు. అయితే, ఐఫోన్ 14 ప్రో డిస్‌ప్లే సమస్యను, ఇతర సమస్యలను పరిష్కరించడానికి యాపిల్ iOS 16.2.1 అనే అప్‌డేట్‌ కొద్దిరోజుల సమయంలోనే విడుదల చేసే అవకాశం ఉంది. గత నెలలో విడుదలైన MacRumors రిపోర్ట్ ప్రకారం.. కస్టమర్లు తమ iPhone 14 Pro ఆన్ చేస్తున్నప్పుడు ఐఫోన్ డిస్‌ప్లేలో గ్రీన్, యెల్లో కలర్ లైన్స్ అడ్డంగా ఫ్లాష్ అవుతున్నట్లు వివరించారు. ఆ సమయంలో యాపిల్ ఈ సమస్యను పరిశీలిస్తుందా అనేది తెలియ రాలేదు. అంతేకాదు ఇది హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్ సమస్యా అనే వివరాలు కూడా వెల్లడి కాలేదు. కాగా ముందుగా చెప్పుకున్నట్లు ఇప్పుడు యాపిల్ కంపెనీ ఈ సమస్యను గుర్తించింది. కస్టమర్లు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఎందుకంటే ఇది హార్డ్‌వేర్ సమస్య కాదని, కేవలం సాఫ్ట్‌వేర్ సమస్యేనని ధృవీకరించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను త్వరలో విడుదల చేయడానికి ప్లాన్ చేసినట్లు ఇంటర్నల్ డాక్యుమెంట్ వెల్లడించింది. ఇక టెక్ దిగ్గజం యాపిల్ కొత్త అప్‌డేట్లు, కొత్త డివైజ్‌లను విడుదల చేస్తోంది. అయితే కొన్ని ఫీచర్లు సరిగ్గా పని చేయడం లేదు. ఈ ఫీచర్లలో హోమ్‌కిట్ ఆర్కిటెక్చర్ ఒకటి. అయితే, యాపిల్ ఈ సమస్యను పరిష్కరించి iOS 16.3 బీటాగా పిలిచే నెక్స్ట్ అప్‌డేట్‌లో హోమ్‌కిట్ ఆర్కిటెక్చర్ ఫీచర్‌ను తిరిగి తీసుకువస్తుందని సమాచారం.

Post a Comment

0 Comments

Close Menu