Ad Code

అమెజాన్ లో 18 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన !


అన్ని రంగాల్లో వ్యాపారాలు అమెజాన్ నిర్వహిస్తోంది. లక్షల కోట్ల ఆదాయాన్ని ఏటా ఆర్జిస్తోంది. అయినప్పటికీ ఆర్థిక మాంద్యం అనే బూచిని చూపి ఉద్యోగులను బలవంతంగా బయటకు గెంటేస్తోంది.. లే ఆఫ్ ప్రకటించి, 18 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇక ఈ లే ఆఫ్ కేవలం యూరప్ దేశాల్లోనే అమలవుతోంది. భారతీయ మూలాలు ఉన్న ఎంతోమంది ఉద్యోగులు బాధితులుగా మారుతున్నారు. గత ఏడాది నవంబర్లో పదివేల మంది ఉద్యోగులను అమెజాన్ తొలగించింది.. అమెజాన్ చరిత్రలో అదే పెద్ద లే ఆఫ్. ఇప్పుడు ఉద్యోగులపై అంతకంటే పెద్ద పిడుగు వేసింది.. ఏకంగా 18 వేల మందికి ఉద్వాసన లేఖలు సిద్ధం చేసింది.. ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా చేయాల్సి ఉన్నప్పటికీ.. కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి లీక్ చేశారు.. దీంతో కంపెనీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.. ఆ కంపెనీ సీఈవో అండీ జస్సీ ప్రకటన చేశారు.

Post a Comment

0 Comments

Close Menu