Ad Code

బుకింగ్‌ క్యాన్సల్ చేసుకుంటే రూ. 2 లక్షలు రిఫండ్ !


ఫోర్డ్  మోటార్ ప్రపంచంలోని టాప్ ఆటోమొబైల్ కంపెనీల్లో ఇదొకటి. ఫోర్డ్ మోటార్ మార్కెట్‌లోకి బ్రాన్‌కో ఎస్‌యూవీ కారును తీసుకువచ్చింది. దీనికి ఫుల్ డిమాండ్ ఉంది. చాలా మంది ఈ కారును ముందుగానే బుక్ చేసుకున్నారు. భారీ బుకింగ్స్‌తో కంపెనీ అవాక్కైంది. వచ్చిన బుకింగ్స్ అన్నింటికీ కార్లను సరఫరా చేయలేమని కంపెనీ పేర్కొంటోంది. అందుకే ఎవరైతే బుకింగ్‌ను క్యాన్సల్ చేసుకుంటారో వారికి రూ. 2 లక్షలు అందిస్తోంది. 2500 డాలర్లను వెనక్కి ఇస్తోంది. మీడియా నివేదిక ప్రకారం చూస్తే.. ఫోర్డ్ బ్రాన్‌కో కారుకు భారీ డిమాండ్ ఉంది. అయితే కంపెనీ విడిభాగాల కొరతతో ఇబ్బంది పడుతోంది. గ్లోబల్‌గా సరఫరా అడ్డంకులను ఎదుర్కొంటోంది. దీని వల్ల తయారీపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇప్పటికే బ్రాన్‌కో కారుకు 2 లక్షలకు పైగా బుకింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే కంపెనీ బుకింగ్స్‌ను క్యాన్సల్ చేసుకునే వారికి 2500 డాలర్ల తగ్గింపు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం కొందరికే వర్తిస్తుంది. బ్రాన్‌కో బుకింగ్ క్యాన్సిల్ చేసుకొని మళ్లీ ఫోర్డ్ కంపెనీకే చెందిన మరో కారును కొంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మెరివిక్, మస్టంగ్, ఎఫ్ 150 ట్రెమ్మర్ వంటి పలు మోడళ్లను అందిస్తోంది. బ్రాన్‌కో మల్టీ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఈ కారులో 2.3 లీటర్ ఎకో బూస్ట్ 4 సిలిండర్ ఇంజిన్, 2.7 లీటర్ ఎకోబూస్ట్ వీ6 ఇంజిన్ ఆప్షన్లలో ఈ కారు అందుబాటులో ఉంది. ఇందులో 7 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్, 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. బేస్ మోడల్‌లో 16 ఇంచుల వీల్స్, టాప్ వేరియంట్‌లో 17 ఇంచుల వీల్స్ ఉంటాయి. బేస్ వేరియంట్ 2 డోర్స్ ఉన్న కారు ధర రూ. 26 లక్షలుగా ఉంది. అలగే 4 డోర్ వేరియంట్ ధర రూ. 29 లక్షలకు పైగా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ. 60 లక్షల దాకా ఉంది.

Post a Comment

0 Comments

Close Menu