Ad Code

మరో 33 భాషలకు గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ ఆఫ్‌లైన్‌ సపోర్ట్‌ !


గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ బాగా పాపులర్‌ అయింది. ఈ అప్లికేషన్‌ను చాలా లేటెస్ట్‌ డివైజెస్‌లలో ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ఒక భాషలోని కంటెంట్‌ను మరో భాషలోకి ట్రాన్స్‌లేట్‌ చేసుకోవచ్చు. కొత్త ప్రాంతాలను సందర్శించినప్పుడు స్థానిక భాష రాక ఇబ్బందులు పడక్కర్లేదు. ఫోన్‌ ద్వారానే సైన్‌బోర్డ్‌లను సులువుగా చదివేయవచ్చు. చాలా మందికి ఉపయోగపడుతున్న ఈ సేవలను గూగుల్‌ ఆఫ్‌లైన్‌లో కూడా అందిస్తోంది. అయితే తాజాగా 33 కొత్త భాషలను ఆఫ్‌లైన్‌లో ట్రాన్స్‌లేట్‌ చేసుకొనేలా అప్‌డేట్‌ అందించింది గూగుల్. ఈ సేవలు ఉపయోగించుకునేందుకు ఆయా భాషల ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ట్రాన్స్‌లేట్ ఆఫ్‌లైన్ ట్రాన్స్‌లేట్‌కు కొత్తగా 33 భాషలను జోడిస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కొత్తగా యాడ్‌ చేసిన భాషలలో దేని నుంచైనా ట్రాన్స్‌లేట్ చేయాల్సి వస్తే, ఇంటర్నెట్‌కి కనెక్ట్ కావాల్సిన అవసరం లేదు. కొత్త భాషల జాబితాలో బాస్క్, సెబువానో, చిచెవా, కోర్సికన్, ఫ్రిసియన్, హౌసా, హవాయియన్, మోంగ్, ఇగ్బో, జావానీస్, ఖైమర్, కిన్యర్వాండా, కుర్దిష్, లావో, లాటిన్, లక్సెంబర్గిష్, మలగసీ, మావోరీ, మయన్మార్ (బర్మీస్), ఒరియా/ఒడియా, సమోవాన్, స్కాట్స్ గేలిక్, సెసోతో, షోనా, సింధీ, సుండానీస్, టాటర్, తుర్క్మెన్, ఉయ్ఘర్, షోసా, యిడ్డిష్, యోరుబా, జులు లాంగ్వేజెస్ ఉన్నాయి. వీటిల్లో చాలా భాషలను లక్షలాది మంది స్థానికులు మాట్లాడుతున్నారు. జులు భాషను మాట్లాడేవారు 12 మిలియన్లకు పైగా ఉన్నారు. ఈ భాష తెలియని వారికి, ఆ భాష మాట్లాడే ప్రదేశాన్ని సందర్శించే వారికి ఈ గూగుల్‌ అప్‌డేట్‌ చాలా ఉపయోగపడుతుంది. ఈ కొత్త భాషలను పొందడానికి Play Storeలో అందుబాటులో ఉన్న Google Translate యాప్ లేటెస్ట్‌ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌కి సంబంధించిన ఏదైనా ఇతర లాంగ్వేజ్‌ ప్యాక్‌ల మాదిరిగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu