Ad Code

మారుతి సుజుకీ నుంచి వస్తున్న5-డోర్ల జిమ్నీ !


జనవరి 13- 18 తేదీల మధ్య జరిగే ఆటో ఎక్స్‌పో-2023 మెగా ఈవెంట్‌లో కార్ మేకర్స్ తమ అప్‌కమింగ్ మోడల్స్ ను ప్రదర్శించనున్నారు. అయితే భారత మార్కెట్‌లో ప్రస్తుతం SUVలకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో ఈ మార్కెట్‌ను క్యాష్ చేసుకోవడానికి కంపెనీలు ఈ సెగ్మెంట్‌లో ఎక్కువ మోడల్స్‌ను తీసుకురానున్నాయి. మారుతి సుజుకి ఇప్పటికే గ్రాండ్ విటారా కాంపాక్ట్ ఎస్‌యూవీని గతేడాది పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ SUV పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడానికి గ్లోబల్ SUV ఇండియా-స్పెక్ వెర్షన్‌ను 'జిమ్నీ 5- డోర్' పేరుతో త్వరలో తీసుకొస్తోంది. దీన్ని ఆటో ఎక్స్‌పో-2023లో కంపెనీ ప్రదర్శించే అవకాశం ఉంది. 3 డోర్ జిమ్నీ మొదటగా ఆటో ఎక్స్‌పో-2020లో ఆవిష్కరించారు. అప్పటి నుంచి భారత్‌లో ఇది విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేసింది. మారుతి సుజుకి తన గుర్గావ్ ప్లాంట్‌లో ప్రతి నెలా 6,000 యూనిట్ల వాల్యూమ్ లక్ష్యంతో జిమ్నీ 5 డోర్ SUVను ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. జిమ్నీ వెనుక సీట్ల యాక్సెస్ కోసం రెండు కొత్త డోర్‌లతో రానుంది. ఈ ఫీచర్ చాలా మంది కార్ కొనుగోలుదారులకు ఆకర్షించవచ్చు. జిమ్నీ 5-డోర్ వెర్షన్ భారతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని కంపెనీ భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విక్రయాలు జరుగుతున్న 3-డోర్ మోడల్‌తో పోలిస్తే ఇది ఎక్కువ వీల్‌బేస్‌తో రానుంది. 5-డోర్ల జిమ్నీ.. 1.5-లీటర్ ఫోర్-సిలిండర్ K15B న్యాచురల్‌ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. ఇది 103 bhp, 138 Nm టార్క్‌ను ప్రొడ్యుస్ చేస్తుంది. ఈ ఇంజన్ ఇప్పటికే XL6, Ertiga, Brezza వంటి కార్లలో వినియోగిస్తున్నారు. మారుతి సుజుకి జిమ్నీ 5-స్పీడ్ MT, 4-స్పీడ్ AT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌తో లభించనుంది. జిమ్నీ స్ట్రాంగ్‌ డిజైన్ ఎలిమెంట్స్ కారణంగా ఇది బోల్డ్ SUVగా అనిపిస్తుంది. ఇండిపెండెంట్ ఇండికేటర్‌లతో కూడిన రౌండ్ హెడ్‌ల్యాంప్స్, క్లామ్‌షెల్ బానెట్, వర్టికల్ ఓపెనింగ్స్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్, రియర్ కాంబినేషన్ ల్యాంప్స్ వంటి ఫీచర్స్ ఇందులో ఉండనున్నాయి. మారుతి సుజుకి బాలెనో, బ్రెజ్జాలో ఉండే స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది. మహీంద్రా థార్, ఫోర్స్ గూర్ఖాతో పోటీగా మార్కెట్‌లోకి మారుతి సుజుకీ జిమ్నీ 5 డోర్ రానుంది. దీని ధర దాదాపు రూ.10 లక్షలు ఉండే అవకాశం ఉంది. థార్, గుర్ఖా ప్రస్తుతం 3-డోర్ ఫార్మాట్‌తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 5 డోర్‌తో రానున్న జిమ్నీకి ఇది ఫ్లస్ కానుందని కంపెనీ భావిస్తోంది. సుజుకి ఆల్‌గ్రిప్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో జిమ్నీ గణనీయమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu