Ad Code

టీసీఎస్ 55 ఇంచుల స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్ !


ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ 55 ఇంచుల స్మార్ట్ టీవీపై ఆఫర్ ప్రకటించింది. టీసీఎల్ కంపెనీకి చెంది 55 ఇంచుల క్యూఎల్ఈడీ అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీపై ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటుందని గుర్తించుకోవాలి. టీసీఎస్ అందిస్తున్న ఈ 55 ఇంచుల స్మార్ట్ టీవీ ఎంఆర్‌పీ రూ. 2,39,990గా ఉంది. అయితే ఈ టీవీ ఇప్పుడు రూ. 69,990 రేటుతో అందుబాటులో ఉంది. అంటే మీకు నేరుగానే 70 శాతం తగ్గింపు లభిస్తోంది. రూ. లక్షా 70 వేల డిస్కౌంట్ ఉంది. ప్రీమియం స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. ఈ టీవీపై రెండేళ్ల వరకు వారంటీ లభిస్తుంది. అందవల్ల ఇబ్బంది పడాల్సిన పని లేదు. అంతేకాకుండా మీకు కావాలంటే ఈ మోడల్‌లోనే 65 ఇంచుల టీవీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీల్లో గూగుల్ వాయిస్ అసిస్టెంట్, క్రోమ్ క్యాస్ట్ ఇన్ బిల్ట్, అల్ట్రా హెచ్‌డీ 4కే, 50 వాట్ స్పీకర్లు, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా డాల్బే సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీల్లో ఏఐపీక్యూ ఇంజిన్ జెన్ 2 చిప్ ఉపయోగించారు. 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, ఐమ్యాక్స్ ఎన్‌హ్యాన్స్డ్, బ్లూటూత్, గూగుల్ డియో, గేమ్ మాస్టర్ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. టీసీఎల్ స్మార్ట్ యూఐ, 2 యూఎస్‌బీ పోర్టులు, ల్యాన్ పోర్ట్, 4 హెచ్‌డీఎంఐ పోర్టులు, హెడ్ ఫోన్ జాక్, డిజిటల్ ఆడియో ఔట్‌పుట్ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీపై ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. నెలకు రూ. 3394 నుంచి ఈఎంఐ ప్రారంభం అవుతోంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. 18 నెలల టెన్యూర్‌కు అయితే నెలకు రూ. 4367 చెల్లించాలి. 12 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 6285 కట్టాల్సి వస్తుంది. బ్యాంక్, టెన్యూర్ ప్రాతిపదికన ఈఎంఐ మొత్తం మారుతూ ఉంటుందని గుర్తించుకోవాలి. ఈ స్మార్ట్ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. రూ. 16,900 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లభిస్తోంది. మీరు టీవీ, దాని కండీషన్ ప్రాతిపదికన మీకు లభించే ఎక్స్చేంజ్ తగ్గింపు కూడా మారుతుంది.

Post a Comment

0 Comments

Close Menu