Ad Code

మారుతి సెవెన్ సీటర్ కారు రూ. 5 లక్షలు !


దేశీయంగా మారుతి సుజుకి కార్లకు మంచి పేరుంది. మెయింటనెన్స్ తక్కువుగా ఉండటమే అందుకు కారణం. భారత్ లో అత్యధిక విక్రయాలు సాధించిన టాప్-10 వాహనాల్లో మారుతి ఈకో ముందు వరుసలో ఉంది. మారుతి ఈకో 5-సీటర్ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 5.13 లక్షలు (ఎక్స్-షోరూమ్), మారుతి సుజుకి ఈకో, CNG వేరియంట్ ధర రూ. 6.44 లక్షలు (ఎక్స్-షోరూమ్). మైలేజీ విషయంలోకొస్తే.. CNG వర్షన్ 26.78 km/kg మైలేజీని ఇస్తోండగా, పెట్రోల్ వర్షన్ 19.71 km/l మైలేజీని ఇస్తోంది. ఈకో వ్యాన్ ఐదు రంగులలో అందుబాటులో ఉంది. మెటాలిక్ బ్రిస్క్ బ్లూ, సాలిడ్ వైట్, పెర్ల్ మిడ్‌నైట్ బ్లాక్, మెటాలిక్ సిల్కీ సిల్వర్ , మెటాలిక్ గ్లిస్టనింగ్ గ్రే రంగులలో అందుబాటులో ఉంది. 2010లో మొదటి సారిగా భారత మార్కెట్లో విడుదలైన మారుతీ ఈకో అప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని లక్షల యూనిట్ల అమ్మకాలు సాదించింది. వ్యాన్ సిగ్మెంట్ లో దాదాపు 80 శాతం వాటా మారుతి ఈకోనే సొంతం చేసుకుంది. బీఎస్4 మోడల్ తో పోలిస్తే బీఎస్6 అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత నెలలో 10,581 యూనిట్లను విక్రయించిన కంపెనీ, డిసెంబర్ 2021లో 9,185 యూనిట్లు విక్రయించినట్లు తెలిపింది. మొత్తం మీద 2022-23 ఆర్థిక సంవత్సరంలో 96,135 యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. బీఎస్4 మోడల్ తో పోలిస్తే బీఎస్6 మోడల్ లో ప్రధానమైన మార్పులేమి లేవు. మారుతీ వ్యాను సిగ్నేచర్ స్టైల్ అయిన స్లైడింగ్ డోర్లు, ఇంటిరీయర్ క్యాబిన్ స్పేస్ అలాగే ఉంచారు. ప్రయాణికులు ఎక్కేందుకు, దిగేందుకు అనువుగా ఉండటే కాకుండా ఇరుకు రోడ్లలోనూ సులభంగా దిగేందుకు ఈ స్లైడింగ్ డోర్లు ఉపయోగపడతాయి. 5 నుంచి 7గురు వరకు సౌకర్యవంతంగా కూర్చొనే ఈ కారు బహుళ వేరియంట్లలో లభ్యమవుతోంది. 5 సీటర్ స్టాండర్డ్, 5 సీటర్ AC, 7 సీటర్ స్టాండర్డ్, 7 సీటర్ AC, అంబులెన్స్ , అంబులెన్స్ షెల్ ఉన్నాయి. అలాగే.. వ్యాన్ టూర్, కార్గో వంటి వాణిజ్య వాహనంగాను బాగుంటుంది.


Post a Comment

0 Comments

Close Menu