Ad Code

మోటోరోలో జీ62 5జీపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ !


బిగ్‌ సేవింగ్స్‌ డేస్‌ సేల్‌తో వినియోగదారులను అట్రాక్ట్‌ చేసిన ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఎలక్ట్రానిక్‌ సేల్‌ పేరుతో ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్స్‌పై ఆఫర్లను ఇస్తోంది. మోటోరోలో జీ62 5జీ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 21,999గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా రూ. 14,999కే అందిస్తోంది. దీంతో పాటు పలు బ్యాంకుల డెబిట్‌, కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. గరిష్టంగా రూ. 750 తగ్గింపు ధరకు పొందొచ్చు.  పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేసుకోవడం ద్వారా మరింత తక్కువ ధరకు ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. పాత ఫోన్‌ కండిషన్‌ ఆధారంగా గరిష్టంగా రూ. 5000 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ. 10 వేలలోపు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.55 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీతో అందించిన ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ లిథియం పాలీమార్‌ 5జీ ప్రాసెసర్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్‌+8 మెగాపిక్సెల్‌ + 2 మెగా పిక్సెల్‌ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu