Ad Code

లాంచ్ ఆఫర్ గా ఈ రోజు రూ.6,299కే పోకో సీ 50 !


పోకో సీ 50 స్మార్ట్ ఫోన్ ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈరోజు మొదటి సేల్ కావడంతో ఇంట్రడక్టరీ అఫర్ లో భాగంగా ఈ ఫోన్ ను మరింత తక్కువ ధరకే అఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.6,499 రూపాయల ధరతో లాంచ్ చెయ్యగా, ఈరోజు ఆఫర్ లో భాగంగా కేవలం రూ.6,299 రూపాయల ధరకే సేల్ చేస్తోంది.  2GB ర్యామ్ మరియు 32 GB స్టోరేజ్ వేరియంట్ కోసం సెట్ చేసింది. ఈరోజు కేవలం రూ.6,299 రూపాయలకే లభిస్తుంది. ఇందులో 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,299 రూపాయలుగా ప్రకటించింది. ఈ ఫోన్ కంట్రీ గ్రీన్ మరియు రాయల్ బ్లూ అనే రెండు కలర్ అప్షన్లలో లభిస్తుంది. ఈ సార్ట్ ఫోన్ Flipkart నుండి సేల్ అవుతోంది. పెద్ద 6.5 ఇంచ్ స్క్రీన్ ని HD+ రిజల్యూషన్ తో కలిగి వుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio A22 క్వాడ్ కోర్ ప్రాసెసర్ కి జతగా 2GB/3GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. మెమోరీ కార్డ్ ద్వారా స్టోరేజ్ ను 512GB వరకూ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ వెనుక లెథర్ వంటి టెక్స్చర్ డిజైన్ తో ఆకర్షణీయంగా వుంది. ఫోన్ వెనుక డ్యూయల్ కెమేరా సెటప్ ఓ వచ్చింది. ఇందులో, 8MP మెయిన్ కెమేరాతో మరొక కెమెరాతో వస్తుంది. అలాగే, ముందుభాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12  ఆపరేటింగ్ సిస్టం పైన పనిచేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu