Ad Code

800 మంది ఫ్రెషర్లను తొలగించిన విప్రో !


ప్రముఖ దేశీయ ఐటీ కంపెనీ విప్రో అంతర్గత పరీక్ష తర్వాత పేలవమైన పనితీరు కారణంగా 800 మంది ఫ్రెషర్ ఉద్యోగులను తొలగించినట్లు బిజినెస్ టుడే తెలియజేస్తుంది. ఉద్యోగుల శిక్షణ నిమిత్తం ఖర్చుపెట్టిన రూ.75,వేలను అభ్యర్థులు చెల్లించాల్సి ఉందని , అయితే దాన్ని మాఫీ చేస్తున్నట్టు వారికి పంపిన టెర్మినేషన్‌ లెటర్‌లో పేర్కొంది. ఉద్యోగాలను కోల్పోయిన ఫ్రెషర్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను తొలగించేందుకు ఇదొక సాకు మాత్రమే నని ఆరోపించారు. 2022, జనవరిలో ఆఫర్ లెటర్ ఇచ్చి, ఆన్‌బోర్డ్ చేశారనీ, ఇప్పుడు ఇంటర్నల్‌ పరీక్ష సాకుతో తనను ఉద్యోగం లోంచి తీసేస్తున్నారని మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu