Ad Code

ఆవు పేడతో నడిచే ట్రాక్టర్ ?


బ్రిటన్ కు చెందిన ఇంధన సంస్థ ఆవు పేడతో నడిచే 270 హార్స్ పవర్ కలిగిన t-7 లిక్విడ్ మిథైన్ కింద ట్రాక్టర్ ను ఆవిష్కరించబోతుంది.  గ్రీన్ ఎనర్జీతో వ్యవసాయానికి సరికొత్తగా విప్లవాత్మక మార్పులను చేసేందుకే బ్రిటన్ కంపెనీ ఆవుపేడతో నడిచేటువంటి ఒక ట్రాక్టర్ ను ఆవిష్కరించింది. సాధారణ డీజిల్ ఇంజన్లకు దీటుగా ఈ ట్రాక్టర్ ఎనర్జీ ఉత్పత్తులను తయారు చేస్తుందని కంపెనీ వ్యవస్థాపకులు క్రిస్ మాన్ పేర్కొన్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ మెరుగైన సామర్థ్యంతో కూడిన ఈ ట్రాక్టర్ ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆవిష్కరణ చేపడుతామని తెలియజేశారు. కాన్ వాల్ కౌంటిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ ట్రాక్టర్ ను ట్రయల్ నిర్వహించినట్లుగా తెలియజేశారు. కార్బన్డయాక్సైడ్ వాయువులు ఏడాదిలో 2500 మెట్రిక్ టన్నుల నుంచి 500 మెట్రిక్ టన్నులకు తగ్గిస్తాయని తెలియజేశారు. డీజిల్ తరహాలోనే అదే స్థాయిలో ఈ ట్రాక్టర్ క్రమోజనిక్ ట్యాంక్ పవర్ను అందిస్తుందని దీనివల్ల కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆ కంపెనీ సమస్త తెలియజేస్తోంది. ఈ కంపెనీ గత మోడల్ t-6 మీథేన్ పవర్ సిఎస్జి ట్రాక్టర్ తో పోలిస్తే ఏ ట్రాక్టర్ ఇందన సామర్థ్యం నాలుగు రెట్లు అధికంగా ఉంటుందని బెన్ మన్ తెలియజేసింది. T-7 మిథైన్ పవర్ ఎల్ ఎన్ జి ట్రాక్టర్ నాన్ వెంటింగ్ క్రమోజనిక్ స్టోరేజ్ ట్యాంక్ మీద లిక్విడ్ ను మెయింటైన్ చేస్తూ క్లీన్ పవర్ నూతన వరుసగా సేద్యం రంగం వైపుకు తీసుకువచ్చిందట. ఇక ఎందుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేశారు.

Post a Comment

0 Comments

Close Menu