Ad Code

గూగుల్ వాచ్ లో అన్‌లాక్‌ ఫీచర్ !


లాక్ ఫీచర్‌లో ఉన్న లోపాలను సరిచేసి గూగుల్ వాచ్ అన్‌లాక్‌ అనే కొత్త యాక్టివ్ అన్‌లాక్ ఆప్షన్‌ను లాస్ వెగాస్‌లోని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ప్రదర్శించింది. ఈ ఫీచర్ ఫోన్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్ పని చేయకపోయినా లేదా ఫేస్ ID ఓనర్‌ను సరిగా గుర్తించలేకపోయినా వాచ్ ద్వారా అన్‌లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. గూగుల్ ఇప్పటికే స్మార్ట్ లాక్ ఫీచర్‌ని తీసుకొచ్చింది కానీ దీనివల్ల యూజర్లు కొన్ని సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ సమస్యలకు చెక్ పెడుతూ ఈ ఫీచర్‌ను వాచ్ అన్‌లాక్‌ పేరుతో స్మార్ట్‌వాచ్‌కి గూగుల్ తీసుకొస్తోంది. కాగా వాచ్ అన్‌లాక్‌ ఫీచర్ ఆన్ చేసి దానిని ధరించకుండా పక్కన పెట్టినప్పుడు ఫోన్ అనేది నార్మల్‌గా లాక్ పడిపోతుంది. దీనివల్ల సెక్యూరిటీ మరింత పెరుగుతుంది. అలానే గూగుల్ కొన్ని కారణాల వల్ల దాని ఫీచర్లను పరిమితం చేస్తోంది. అంటే మీరు మీ స్మార్ట్‌వాచ్‌ ద్వారా పేమెంట్స్ చేయడానికి కొత్త ఆప్షన్ ఉపయోగించలేరు. కంపెనీ CESలో ఈ ఫీచర్‌ను షో చేసినప్పటికీ, గూగుల్ ఇంకా దీని గురించి ప్రకటన చేయలేదు. దీన్నిబట్టి ఈ ఫీచర్ టెస్టింగ్‌ దశలో ఉందని, దానిని విడుదల చేయడానికి మేలో జరిగే Google I/O 2023 డెవలపర్ కాన్ఫరెన్స్ వరకు మీరు వేచి ఉండాల్సి రావచ్చని తెలుస్తోంది. ఇక "వాచ్ అన్‌లాక్" అనే కొత్త ఫీచర్ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఉపయోగించే ఫోన్‌లలో పని చేయవచ్చు. ఎందుకంటే ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌ "యాక్టివ్ అన్‌లాక్ API" అనే ప్రత్యేక టూల్‌తో వస్తుంది. దీని వల్ల పిక్సెల్ వాచ్‌లోని అన్‌లాక్ ఫీచర్ పొందడం సాధ్యమవుతుంది. ప్రస్తుతానికి ఇది Google పిక్సెల్ వాచ్‌లో మాత్రమే పని చేస్తుందనేలా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఫీచర్ కేవలం Google Pixel వాచ్‌కు ఎక్స్‌క్యూజివ్ అని చెప్పడానికి ఇప్పటివరకైతే సరైన ఇన్ఫర్మేషన్ లేదు. యాపిల్ ప్రవేశపెట్టిన ఫీచర్లలో యాపిల్ వాచ్‌ని ఉపయోగించి ఐఫోన్‌ను అన్‌లాక్ చేయగల సామర్థ్యం ఒకటి. దీన్ని ఆండ్రాయిడ్ డివైజ్‌లకు కూడా గూగుల్ తీసుకొచ్చేందుకు కృషి చేయడం ఇప్పుడు యూజర్లను ఖుషి చేస్తోంది. గూగుల్ ఈ వాచ్ అన్‌లాక్ ఫీచర్‌ను ఎలాంటి లోపాలు లేకుండా తీసుకువచ్చేందుకు కాస్త సమయం పట్టొచ్చు.

Post a Comment

0 Comments

Close Menu