Ad Code

షియోమీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ రాజీనామా !


షియోమీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్, ఇండియా మాజీ హెడ్ మను కుమార్ జైన్ రాజీనామా చేశారు. తొమ్మిదేండ్లుగా షియోమీలో మను కుమార్ జైన్ సేవలందించారు. షియోమీ ఇండియా మనీ లాండరింగ్‌కు పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి. విదేశీ మారక ద్రవ్య యాజమాన్య చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించిందన్న అభియోగంపై షియోమీ ఇండియాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతున్న నేపథ్యంలో మను కుమార్ జైన్ వైదొలగడం ఆసక్తికర పరిణామం. 'జీవితంలో మార్పు ఒక్కటే స్థిరం. గత తొమ్మిదేండ్లుగా నా పట్ల షియోమీ యాజమాన్యం చూపిన ఆదరాభిమానాలకు అదృష్టవంతుడ్ని. ఇటువంటి పరిస్థితుల్లో సంస్థ నుంచి వైదొలగడం కష్టంగా ఉంది. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు` అని ట్వీట్ చేశారు. `పలు ఉత్తేజకరమైన అవకాశాలు అందుబాటులో ఉండగా, ఒక ప్రయాణం ముగింపు మరో ప్రయాణానికి నాంది. న్యూ అడ్వెంచర్‌కు స్వాగతం పలుకుతున్నా` అని పేర్కొన్నారు. 2014లో భారత్‌లో షియోమీ ఆవిష్కరణలో మను కుమార్ జైన్ కీలకంగా వ్యవహరించారు. భారత్ మార్కెట్‌లో విస్తరణకు కృషి చేశారు. `తొమ్మిదేండ్ల తర్వాత షియోమీ గ్రూప్ నుంచి వైదొలుగుతున్నా. ప్రపంచవ్యాప్తంగా మా సంస్థకు సమర్థవంతమైన బృందాలు ఉన్న ప్రస్తుత తరుణంలో వైదొలగడం సరైందని విశ్వసిస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా జియో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా` అని మను కుమార్ జైన్ పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu