Ad Code

షైబారా ద్వీపంలో అత్యాధునిక రెస్టారెంట్


షైబారా ద్వీపంలో అత్యాధునిక రెస్టారెంట్ నిర్మిస్తున్నారు. ఈ రెస్టారెంట్ 2024 నాటికి ప్రజలకు అందుబాటులోకి రానుంది. పర్యావరణానికి అనుకూలంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదేశంలో సోలార్ ఫారమ్‌ కూడా ఏర్పాటు చేశారు. షైబారా ద్వీపంలో నిర్మించిన షైబరా రిసార్ట్ 2024 నాటికి ప్రజలకు తెరవబడుతుందని మీడియా నివేదికలలో పేర్కొంది. ఖిలా డిజైన్ అనే సంస్థ దీన్ని రూపొందిస్తోంది. వాతావరణ పరిస్థితులు, పర్యావరణ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని దీన్ని నిర్మిస్తున్నారు. షైబరా రిసార్ట్ సౌదీ అరేబియా నుండి 45 నిమిషాల దూరంలో నిర్మించబడింది. అయితే ఈ రెస్టారెంట్‌కి చేరుకోవాలంటే కేవలం షిప్‌లు, పడవ ప్రయాణం ద్వారానే సాధ్యమవుతుంది. అయితే ఈ రెస్టారెంట్‌ని సందర్శించడం అందరికి సాధ్యమయ్యే పని కాదు. కొంచెం ఖర్చుతో కూడుకున్న పనిగా కనిపిస్తోంది. ఈ డిఫరెంట్‌ కాన్సెప్ట్, స్టైల్‌తో కూడిన షైబరా రిసార్ట్‌లో నిర్మిస్తున్న ఫ్యూచరిస్టిక్ ఆర్బ్స్ హోటల్ చూడటానికి కూడా విచిత్రమైన ఆకర్షణలో ఉంటుంది. పగడపు దిబ్బ కూడా ఇక్కడ నుండి స్పష్టంగా చూడవచ్చు. ఈ వినూత్న రెస్టారెంట్‌లో ఒకేసారి 140 మంది అతిధులు బస చేయవచ్చు. అతిధులకు సేవ చేయడానికి 260 మంది సిబ్బంది ఉంటారు. అడవులు, ఎడారి వృక్షాలు, తెల్లటి ఇసుక తిన్నెలు కూడా ఇక్కడ కనిపిస్తాయి

Post a Comment

0 Comments

Close Menu