Ad Code

కాగ్నిజెంట్‌ కొత్త సీఈవో రవి కుమార్‌


ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ రవి కుమార్‌ కాగ్నిజెంట్ కొత్త సీఈవోగా ఎంపికయ్యారు. మాజీ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ స్థానంలో రవి కుమార్‌ నియమితులయ్యారు. ఈయన ఆన్-డిమాండ్ సొల్యూషన్స్, సాలిడ్ బ్రాండింగ్ ,అంతర్జాతీయ విస్తరణను పర్యవేక్షిస్తారు.  గ్రోత్‌కు సంబంధించి మంచి  పొజిషన్‌లో ఉన్న కాగ్నిజెంట్‌ సీఈవోగా ఎంపిగాకవడం సంతోషంగా ఉందని అని కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని సొంతం చేసుకున్న రవికుమార్‌ వార్షికవేతనం ఇపుడు హాట్‌ టాపిక్‌గా నిలిచింది. రవి కుమార్‌ జీతం సంవత్సరానికి రూ. 57 కోట్లు (7 మిలియన్ డాలర్లు). దీంతోపాటు దాదాపు రూ. 6 కోట్లు (7,50,000 డాలర్ల ) జాయినింగ్ బోనస్‌ను కూడా అందు కోనున్నారు. యాన్యువల్‌ బేసిక్‌ సాలరీగా ఒక మిలియిన్‌డాలర్లు చెల్లింస్తుంది కంపెనీ. అలాగే 2 మిలియన్‌ డాలర్ల నగదు ప్రోత్సాహకం, వన్ టైమ్ హైర్ అవార్డుగా 5 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ రిటర్న్‌లను పొందనున్నారు. 2016 నుంచి 2022 మధ్య కాలంలో మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు రవి కుమార్ అధ్యక్షుడిగా ఉన్నారు. మొత్తం రెండు దశాబ్దాల పాటు ఆ కంపెనీలోనే కొనసాగారు.  ట్రాన్స్‌యూనియన్ , డిజిమార్క్ కార్ప్ బోర్డులలో కూడా పని చేశారు. 

Post a Comment

0 Comments

Close Menu