Ad Code

యాపిల్ నుంచి చౌకైన ఐప్యాడ్‌ ?


కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లలో నంబర్.1గా రాణించాలని యాపిల్ తపన పడుతోంది. అందుకు తన ప్రొడక్ట్స్‌ను చౌక ధరల్లో కూడా తీసుకొస్తుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది తక్కువ ధరతో ఒక ఐప్యాడ్‌ ను తీసుకొచ్చే పనిలో నిమగ్నమైందని  బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ ఐప్యాడ్ మోడల్‌ను మాగ్నెటిక్ ఫాస్టెనర్లను ఉపయోగించి గోడలపై ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. యూజర్లు దీనితో లైట్లను కంట్రోల్ చేయవచ్చు. వీడియోలను ప్లే చేయవచ్చు, పేస్ టైం కాల్స్‌ సైతం చేసుకోవచ్చు. ఇంకా ఇతర స్మార్ట్ హోమ్ డివైజ్‌లను కంట్రోల్ చేయవచ్చు. యాపిల్ చౌకైన ఐప్యాడ్‌తో పాటు స్మార్ట్ డిస్‌ప్లేతో కూడిన హోమ్‌పాడ్ లాంటి ఒక డివైజ్ తీసుకొచ్చేందుకు కూడా కృషి చేస్తుందని నివేదిక పేర్కొంది. స్మార్ట్‌స్క్రీన్‌ డివైజ్‌ల మార్కెట్లో గూగుల్ తీసుకొచ్చిన నెస్ట్ హబ్ మ్యాక్స్‌, అమెజాన్ పరిచయం చేసిన ఎకో షో తక్కువ ధరలకే లభిస్తున్నాయి. వీటితో పోల్చుకుంటే ప్రస్తుత ఐప్యాడ్‌ ధర చాలా ఎక్కువ. ఈ కారణంగా స్మార్ట్ హోమ్ డివైజ్‌ తీసుకునే వారిలో దీనిని ఎక్కువమంది ప్రిఫర్ చేయడం లేదు. అందుకే యాపిల్ వర్సటైల్ ఫీచర్లతో వచ్చే తన స్మార్ట్ డిస్‌ప్లే డివైజ్ & ట్యాబ్లెట్ కంప్యూటర్ అయిన ఐప్యాడ్‌ను తక్కువ ప్రైస్ ట్యాగ్‌తో రిలీజ్ చేయాలని కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.


Post a Comment

0 Comments

Close Menu