Ad Code

ఐఫోన్ల తయారీలోకి టాటా గ్రూప్ ?


తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్, విస్ట్రోన్, పెగాట్రాన్ వంటి కంపెనీలు ఇండియాలోనే మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు స్థాపించి యాపిల్ ఐఫోన్లు తయారు చేస్తున్నాయి. అయితే వీటిలో ఒకటైన విస్ట్రోన్ ప్లాంట్‌ను టేకోవర్ చేయడానికి టాటా గ్రూప్ నెలల తరబడి చర్చలు జరుపుతోంది. ఇప్పుడు విస్ట్రోన్ కార్ప్‌తో టాటా గ్రూప్ మార్చి చివరి నాటికి ప్లాంట్‌ను కొనుగోలు డీల్‌ను ఫైనలైజ్ చేయాలని చూస్తోంది. ఈ విషయాన్ని ఇద్దరు అధికారులు తెలిపినట్లు బ్లూమ్‌బెర్గ్ మీడియా న్యూస్‌ రిపోర్ట్ వెల్లడించింది. ఈ రెండు సంస్థలు కొద్ది రోజులపాటు వివిధ టైఅప్‌ల గురించి చర్చించాయని కానీ ఇప్పుడు చర్చలు అనేవి జాయింట్ వెంచర్‌లో ఎక్కువ భాగం టాటా తీసుకోవడంపై కేంద్రీకృతమై ఉన్నాయని వారు తెలిపారు. బెంగళూరు నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో విస్ట్రోన్ ప్లాంట్ ఉంది. టాటా గ్రూప్‌కి ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్‌పై ఎలాంటి ముందస్తు అనుభవంగానీ స్కిల్స్ గానీ లేవు కాబట్టి ప్రధాన తయారీ కార్యకలాపాలలో విస్ట్రోన్ సపోర్ట్ తీసుకొనుందని వారు వెల్లడించారు. ఈ డీల్ ఓకే అయితే ఇండియాలో ఐఫోన్ల తయారీ చేపట్టిన మొదటి ఇండియన్ కంపెనీగా టాటా గ్రూప్ అవతరిస్తుంది. ఐఫోన్‌లను తయారు చేయడం చాలా కష్టమైన పని కాబట్టి టాటా పరిశ్రమలో విక్రేత పరిజ్ఞానాన్ని ఉపయోగించడం.. స్థానిక పరిస్థితులలో ఐఫోన్‌లను తయారు చేయడంలో ముందస్తు అనుభవాన్ని ఉపయోగించడం అవసరం. సర్వర్ల తయారీ వంటి ఇతర విభాగాల్లో తమ సేవలను విస్తరించి రెవిన్యూ పెంచుకునే ఉద్దేశంతో ఐఫోన్-ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాటజీ వ్యూహం నుంచి నెమ్మదిగా విస్ట్రోన్‌ వైదొలుగుతోంది. యాపిల్ కంపెనీ తన ఐఫోన్ల తయారీకి చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశాన్ని పరిగణిస్తోంది. కానీ ఇక్కడ నుంచే తన మ్యానుఫ్యాక్చరింగ్ కార్యకలాపాలను ఆపేయాలని విస్ట్రోన్ యోచిస్తుండటం గమనార్హం. కరోనా తర్వాత ఐఫోన్ల తయారీ కోసం చైనాపై ఆధారపడటాన్ని యాపిల్ తగ్గించాలనుకుంటోంది. దానికి బదులుగా ఇండియా, వియత్నాం దేశాలను ఎంపిక చేసుకోవాలని చూస్తోంది. ఇక్కడ యాపిల్ తన ఉత్పత్తులను చాలా సంవత్సరాలుగా తయారు చేస్తోంది. యాపిల్ తన మొదటి సెట్ రిటైల్ స్టోర్‌లతో భారతదేశంలో తన ఉనికిని మరింత బలోపేతం చేయాలని చూస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా భారతదేశంలో తన రిటైల్ టీమ్‌ను నియమించుకోవడం ప్రారంభించింది. యాపిల్ తన ఐఫోన్ SE వేరియంట్ నుంచి ఇండియాలో ఐఫోన్లను తయారు చేస్తోంది. ఇది దేశంలో సరికొత్త ఐఫోన్ 14 మోడల్‌ను కూడా అసెంబుల్ చేసింది.

Post a Comment

0 Comments

Close Menu