Ad Code

బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సదవకాశం !


భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, సిటీ ఆన్ లైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ తో జతగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ సర్వీస్ లను తీసుకొచ్చింది. ఈ సర్వీస్ ల ద్వారా ఒకే కనెక్షన్ పైన బ్రాండ్ బ్యాండ్ మరియు టీవీ ఛానల్స్ ను పొందవచ్చు. బిఎస్ఎన్ఎల్ ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ సర్వీస్ లను విజయవాడలో ప్రారంభించింది. ఈ సర్వీస్ ను ఉల్కా టీవీ పేరుతో అందించింది మరియు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లోని బ్రాండ్ బ్యాండ్ వినియోగదారులు పొందనున్నారు. బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ సర్వీస్ లను కొత్త కస్టమర్లు మరియు ఇటప్పటికే కొనసాగుతున్న కస్టమర్లు కూడా పొందవచ్చు. అంతేకాదు, ఈ సర్వీసులు కేవలం టీవీలలో మాత్రమే కాదు స్మార్ట్ ఫోన్లలో కూడా బిఎస్ఎన్ఎల్ వినియోగధారులు పొందవచ్చు. బిఎస్ఎన్ఎల్  బ్రాండ్ బ్యాండ్ ప్లాన్స్ పైన అందిస్తున్న ఈ కొత్త సదవకాశం వినియోగదారులకు ఒకే కనెక్షన్ పైన రెండు లాభాలను అందిస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu