Ad Code

పెట్రోల్, కరెంట్ అవసరం లేని బైక్ !


ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన బాజాన్‌ అనే యువకుడికి చిన్ననాటి నుంచి చదువుపై పెద్దగా శ్రద్ద లేదు. దీంతో 9వ తరగతికే ఫుల్ స్టాప్ పెట్టాడు. అనంతరం చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం నెట్టుకొచ్చిన అతడు, రోజులు గడిచే కొద్దీ అనుభవజ్ఞుడైన వాహనాల బ్యాటరీ మెకానిక్‌గా మారాడు. ఇది అతనికి సంతృప్తినివ్వలేదు. కానీ, కుటుంబ పోషణ కోసం తప్పలేదు. దీంతో ఈ పని కొనసాగిస్తూనే ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. మొదట బ్యాటరీతో నడిచే మోటారు సైకిల్‌ను తయారు చేసి అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు. అయితే, ఆ బైక్ విద్యుత్తు ఛార్జీ ఉన్నంత వరకే పరుగులు పెట్టడం, ఆ తర్వాత ఆగిపోతుండటం అతనికి నచ్చలేదు. దీనికి పరిష్కారం ఎలా అని ఆలోచించసాగాడు. అటు పెట్రోలు, ఇటు కరెంటు అవసరం లేకుండా నడిచే వాహనాన్ని తయారు చేయాలన్న ఆలోచన తన మదిలో తట్టింది. అందుకు రెండు డ్రై బ్యాటరీలను తీసుకొని తన ఎక్సెల్‌ వాహనానికి బిగించాడు. వాహనం నడుస్తున్నపుడు బ్యాటరీలు వాటంతటవే రీఛార్జి అయ్యేలా రూపొందించాడు. బైకులో ఇంజిన్‌కు బదులుగా ఒక హబ్‌ ను ఏర్పాటు చేశాడు. ఈ హబ్ శక్తిని చోదక శక్తిగా మారుస్తుంది. బ్యాటరీల ద్వారా వచ్చే శక్తిని హబ్‌కు చేర్చి వాహనాన్ని ముందుకెళ్లేలా ఏర్పాటు చేశాడు. దీంతో వాహనం నడిచేకొద్దీ చోదక శక్తి ద్వారా బ్యాటరీ అదంతట అదే రీఛార్జి అవుతుంది. ప్రస్తుతం ఈ బైక్ 50 కి.మీ. వేగంతో దూసుకెళ్తోంది. బ్యాటరీలకు రూ.13 వేలు, హబ్‌కు రూ.35 వేలు, ఛార్జింగ్‌ మోటారుకు రూ.12 వేలు ఖర్చయినట్లు బాజాన్‌ తెలిపాడు. ప్రభుత్వం సహకారం అందిస్తే మరిన్ని ప్రయోగాలు చేస్తా అంటున్నాడు. 

Post a Comment

0 Comments

Close Menu