Ad Code

మద్యం ఎంత తాగారో చెప్పే స్మార్ట్‌ ఫోన్‌


ఒక వ్యక్తి ఎంత మద్యం తీసుకున్నాడన్న విషయాన్ని అతను మాట్లాడుతున్న తీరు ఆధారంగా కనిపెట్టే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆల్గరిథమ్‌ను పరిశోధకులు రూపొందించారు. లా ట్రోబ్ విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ ఆల్గరిథమ్‌ను రూపొందించారు. మద్యం సేవించిన వ్యక్తి 12 సెకన్ల ఆడియో క్లిప్‌ను వినడం ద్వారా వారు ఎంత ఆల్కహాల్ తీసుకున్నారో చెప్పేస్తుంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న బ్రీత్‌ అనలైజర్ ద్వారా ఎంత ఆల్కహాల్‌ తీసుకున్నారో తెలుసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు కేవలం మత్తులో మాట్లాడిన మాటల ఆధారంగా ఎంత మద్యం తీసుకున్నారో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఆల్గరిథమ్‌ను మరింత డెవలప్‌ చేసిన తర్వాత మొబైల్ అప్లికేషన్‌ రూపంలో తీసుకున్నారు. దీని ద్వారా స్మార్ట్‌ ఫోన్‌లో యాప్‌ ఓపెన్‌ చేసిన ఎదుటి వ్యక్తి మాటలను రికార్డ్‌ చేస్తే చాలు వారు మద్యం ఎంత తీసుకున్నారో ఇట్టే చెప్పేస్తుంది. 12,360 ఆడియో క్లిప్‌ల డేటా బేస్‌ను ఉపయోగించి చేసిన పరిశోధనలు విజయవంతం అయినట్లు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu