Ad Code

ఇంట్లో 'అలెక్సా' ఉందా ?

 


ఇంట్లోని వివిధ పరికరాలను కూర్చున్న చోటు నుంచే ఆన్, ఆఫ్ చేయడానికి, గూగుల్‌ను ప్రశ్నలు అడిగి జవాబులు తెలుసుకోవడానికి, పాటలు వినడానికి ఇలా ఎన్నో పనులకు ఈ బుల్లి పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ పరికరాన్ని ఉపయోగించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ పరికరాన్ని బెడ్‌ రూమ్‌లో అస్సలు ఉంచుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. మీరు మాట్లాడుకునేదంతా ఈ పరికరం రికార్డు చేస్తోందట. ఆ డాటాను అమెజాన్ ఉద్యోగులు కొంతమంది వింటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగా మీ వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగినట్లే అని చెప్తున్నారు. అందుకే ఈ పరికరాన్ని కిచెన్, హాల్‌ వంటి ప్రదేశాల్లో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అమెజాన్ కంపెనీ కూడా ఈ విషయం నిజమేనని అంగీకరించింది. అయితే, అలెక్సాను మరింత మెరుగుపరచడం కోసం, రీసెర్చ్‌లో భాగంగానే ఈ పని చేస్తున్నామని చెప్పింది. ఈ మేరకు ఫాక్స్ న్యూస్ ఈ వివరాలను వెల్లడించింది. 

Post a Comment

0 Comments

Close Menu