Ad Code

జియో సరికొత్తగా రీచార్జ్ ప్లాన్లు !


తక్కువ రీచార్జ్ ప్లాన్లతోనే జియో అత్యంత ప్రజాదరణ పొందింది. ఇదే క్రమంలో ఇప్పుడు కొత్త సంవత్సరంలో కూడా తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త రీచార్జ్ ప్లాన్లతో ముందుకొచ్చింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కాలింగ్, ఎస్ఎంఎస్, డేటా ప్రయోజనాలను అందించేలా ప్లాన్‌లు ఈ ప్లాన్లను తీర్చిదిద్దింది. వినియోగదారులు తమకు ఇష్టమైన ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్ ను ఆస్వాదించేలా ప్రత్యేక ఓటీటీ ప్యాక్లను తీసుకొచ్చింది. ప్యాక్లతో అపరిమిత కాలింగ్, హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తోంది.  రూ. 299 ప్లాన్ తో వినియోగదారులు 28 రోజుల పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS, 2GB డేటాతో మొత్తం 56GB పొందుతారు. ఈ ప్లాన్ జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. రూ. 666 ప్లాన్ లో  ప్రీపెయిడ్ వినియోగదారులు 1.5GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను పొందవచ్చు. ఇది 84 రోజుల ప్లాన్ వాలిడిటీతో వస్తుంది. అలాగే జియో యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ ఉంటుంది. రూ. 719 ప్లాన్ లో 2GB రోజువారీ డేటా పరిమితి, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు 84 రోజుల ప్లాన్ వాలిడిటీతో పాటు జియో యాప్‌లకు ఉచిత యాక్సెస్ ఉంటుంది. రూ. 749 ప్లాన్ లో 2GB రోజువారీ డేటా పరిమితి, అపరిమిత కాలింగ్, 90 రోజుల ప్లాన్ వాలిడిటీ, రోజుకు 100 SMSలు ఉంటాయి. కాంప్లిమెంటరీగా జియో యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తుంది. కొత్త సంవత్సరం 2023ని పురస్కరించుకుని జియో రూ. 2023  ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్లో వినియోగదారులు 2.5GB రోజువారీ డేటా పరిమితితో 630GB డేటాను 252 రోజుల వాలిడిటీతో పొందుతారు. అంతేకాక జియో యాప్‌లకు ఉచిత యాక్సెస్‌తో పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు ఆనందించవచ్చు. రూ.2999 ప్లాన్‌పై జియో ప్రత్యేక ఆఫర్‌ను విడుదల చేసింది. అదనపు 23 రోజుల వ్యాలిడిటీ పొడిగింపుతో వినియోగదారులు 365 రోజుల ప్లాన్ వాలిడిటీని పొందవచ్చు . దీంతో పాటు ప్రీపెయిడ్ ప్లాన్‌లో 2.5GB రోజువారీ డేటా పరిమితితో 912.5GB మొత్తం డేటా ఉంటుంది. జియో టీవీ, జియో , జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి యాప్లకు ఉచిత యాక్సెస్ ఉంటుంది.


Post a Comment

0 Comments

Close Menu