Ad Code

సెట్-టాప్ బాక్స్ లేకుండా ఫ్రీ-టు-ఎయిర్ ఛానెల్స్ !


ఇ-వ్యర్థాల నియంత్రణ, క్వాలిటీ, వినియోగదారుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మూడు ఎలక్ట్రానిక్ డివైజ్‌ల కోసం కొత్తగా నాణ్యాత ప్రమాణాలను నోటిఫై చేసింది. ఈ జాబితాలో డిజిటల్ టెలివిజన్ రిసీవర్స్, యూఎస్‌బీ టైప్-సి ఛార్జర్, వీడియో సర్వైలెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి.  బిల్ట్- ఇన్ శాటిలైట్ ట్యూనర్స్‌తో కూడిన డిజిటల్ టెలివిజన్ రిసీవర్స్ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ IS 18112:2022 స్పెసిఫికేషన్‌ను మొదటగా నోటిఫై చేసింది. ఈ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం తయారయ్యే టీవీలకు LNBతో డిష్ యాంటెనాను కనెక్ట్ చేయడం ద్వారా ఉచితంగా ప్రసారమయ్యే టీవీ, రేడియో ఛానెల్‌లను పొందటానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో పే, ఫ్రీ ఛానెల్‌లను చూడాలంటే సెట్-టాప్ బాక్స్‌ తప్పనిసరి. ఇక, దూరదర్శన్ ప్రసారం చేసే ఫ్రీ టు ఎయిర్ ఛానెల్స్ (నాన్- ఎన్‌క్రిప్టెడ్) చూడాలంటే కూడా వీక్షకుడు తప్పనిసరిగా సెట్ టాప్ బాక్స్‌ ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దూరదర్శన్ అనలాగ్ ట్రాన్స్‌మిషన్‌ను తొలగించే ప్రక్రియలో ఉంది. దూరదర్శన్ ద్వారా డిజిటల్ శాటిలైట్ ట్రాన్స్‌మిషన్‌ని ఉపయోగించి ఫ్రీ-టు-ఎయిర్ ఛానెల్స్‌ను సెట్-టాప్ బాక్స్ అవసరం లేకుండా ప్రసారం చేయడానికి అవకాశం ఉంటుంది. USB టైప్-సి రెసెప్టాకిల్స్, ప్లగ్, కేబుల్స్ కోసం బీఐఎస్.. ఇండియన్ స్టాండర్డ్ (IS/IEC 62680-1-3:2022) ను తాజాగా నోటిఫై చేసింది. ప్రస్తుతం ఉన్న గ్లోబల్ స్టాండర్డ్ IEC 62680-1- 3:2022ను అనురించి దీన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం, వివిధ ఎలక్ట్రానిక్ డివైజ్‌ల కోసం కస్టమర్లు వేర్వేరు ఛార్జర్‌లను కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల అదనపు ఖర్చులు, ఇ-వ్యర్థాల పెరుగుదల, విలువైన సమయం వృథా వంటి నష్టాలు ఉన్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కామన్ టైప్ ఛార్జింగ్ పోర్ట్‌లను ప్రవేశపెట్టనుంది. ఇందు కోసం తాజాగా బీఐఎస్ IS/IEC 62680-1-3:2022 అనే క్వాలిటీ స్టాండర్డ్‌ను జారీ చేసింది.  ఈ స్టాండర్డ్ ఇకపై మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, నోట్‌బుక్ వంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌ల్లో USB టైప్-సి పోర్ట్, ప్లగ్, కేబుల్ అవసరాలను అందిస్తుంది. అంటే స్మార్ట్‌ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌ల కోసం కామన్ టైప్ ఛార్జింగ్ పోర్ట్‌లను ప్రవేశపెట్టనున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్.. వీడియో సర్వైలెన్స్ సిస్టమ్స్ (VSS) కోసం ఇండియన్ స్టాండర్డ్ IS 16910 సిరీస్‌ను తాజాగా నోటిఫై చేసింది. దీన్ని ఇంటర్‌నేషనల్ స్టాండర్డ్ IEC 62676 సిరీస్‌ నుంచి స్వీకరించింది. కెమెరా డివైజెస్, ఇంటర్‌ఫేసెస్, సిస్టమ్ రిక్వైర్మెంట్స్, కెమెరా డివైజెస్ ఇమేజ్ క్వాలిటీని నిర్ధారించే టెస్టులు వంటి వీడియో సర్వైలెన్స్ సిస్టమ్స్ కు సంబంధించిన అన్ని అంశాల డీటైల్ అవుట్‌లైన్‌ను ఈ స్టాండర్డ్ ప్రొవైడ్ చేయనుంది. అంతేకాకుండా సిస్టమ్ సమర్థవంతమైన ఇన్‌స్టాలేషన్‌పై మార్గదర్శకాలను కూడా నిర్దేశిస్తుంది. నిఘా వ్యవస్థను మరింత సురక్షితంగా, పటిష్టంగా చేయడంలో ఈ స్టాండర్డ్ దోహదపడనుంది.

Post a Comment

0 Comments

Close Menu