Ad Code

పడిపోయిన స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు !


చైనా మార్కెట్లో గతేడాది స్మార్ట్ ఫోన్ల విక్రయంలో ఒప్పోను దాటేసి.. ఆపిల్ ఐఫోన్లు రెండో స్థానం ఆక్రమించాయి. చైనా మాత్రమే కాదు.. ప్రపంచ దేశాల్లోనూ గతేడాది స్మార్ట్ ఫోన్ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ప్రపంచంలోనే రెండు అతి పెద్ద మార్కెట్లు చైనా, భారత్. డ్రాగన్‌తో పోలిస్తే భారత్‌లో స్మార్ట్ ఫోన్స్ పడిపోయాయని కౌంటర్ పాయింట్ మార్కెట్ రీసెర్చ్ వెల్లడించింది. 2021తో పోలిస్తే 2022లో భారత్‌లో స్మార్ట్ ఫోన్ సేల్స్ తొమ్మిది శాతం తగ్గిపోయాయి. గతేడాది కేవలం 152 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఎంట్రీ లెవెల్‌, బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ల సేల్స్‌లోనే తగ్గుదల నమోదైంది. ఓవరాల్‌గా స్మార్ట్ ఫోన్ల విక్రయాలు తగ్గినా.. రూ.30 వేల కంటే పై చిలుకు స్మార్ట్ ఫోన్ల సేల్స్ మాత్రం రికార్డు స్థాయిలో 35 శాతం పెరిగాయి. ఈ క్యాటగిరీలో తొలిసారి డబుల్ డిజిట్స్ 11 శాతం పెరిగాయి. ఇక చైనాలో వరుసగా ఐదో ఏడాది స్మార్ట్ ఫోన్ సేల్స్ 2022లో 14 శాతం తగ్గాయి. అన్ని రకాల బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ సేల్స్ పడిపోయాయి. సేల్స్‌లో మూడుశాతం తగ్గుదల నమోదైనా చైనాలో దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పోను దాటేసి ఆపిల్ ఐ-ఫోన్లు రెండో స్థానాన్ని ఆక్రమించింది. గతేడాది మొత్తం స్మార్ట్ ఫోన్ల సేల్స్‌లో 5జీ ఫోన్ల వాటా 32శాతానికి పెరిగింది. 2021లో స్మార్ట్ ఫోన్ల విక్రయం 19 శాతం పెరిగితే, 2022లో అది 32 శాతానికి దూసుకెళ్లింది. 5జీ స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌లో శ్యామ్‌సంగ్ 21 శాతం వాటాతో మొదటి స్థానం కొట్టేసింది. సేల్స్ ఆదాయంలోనూ 22 శాతం పెంచుకున్నది శ్యామ్‌సంగ్‌.

Post a Comment

0 Comments

Close Menu