Ad Code

ఫ్లైయింగ్ బైక్ బుకింగ్స్ ప్రారంభం !


కార్లు, బైక్‌లు గాల్లో ఎగురుతూ వెళ్తుంటే ఎంత బాగుంటుంది ఆలోచించే వారికి ఇప్పుడు ఆ కల వాస్తవ రూపం దాల్చనుంది. కాకుంటే.. సామాన్యులకు గాల్లో ఎగరాలన్నా కోరిక తీరకపోవచ్చు. ఎందుకంటే.. దీని ప్రారంభ ధర అక్షరాలా రూ.3.15 కోట్లు. రాబోవు 2-3 ఏళ్లలో మార్కెట్‌లోకి రానున్న ఈ బైక్‌లకు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఎగిరే ఈ బైక్ గాలిలో దాదాపు 100 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. ఒకేసారి గాలిలో 30 నుంచి 40 నిమిషాల పాటు ఎగురగలదు. అమెరికాకు చెందిన జెట్ ప్యాక్ కంపెనీ ఈ బైక్‌ను తయారుచేసింది. ప్రస్తుతం ఈ కంపెననీ అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం ఎదురుచూస్తోంది. 136 కిలోల బరువున్న ఈ బైక్‌.. 272 కిలోల బరువును మోయగలదు. ఈ బైక్‌ను రిమోట్‌ ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు. తొలి డిజైన్‌లో నాలుగు టర్బైన్‌లు ఉండేవి. కాగా, తుది ఉత్పత్తిలో 8 టర్బైన్లను కలిగి ఉంటుంది. నిజానికి ఈ ఎగిరే బైక్ ఒక ఎయిర్ యుటిలిటీ వాహనం. అంటే.. మెడికల్ ఎమర్జెన్సీ, అగ్నిప్రమాదాలు సంభవించిన సందర్భాల్లో దీనిని వాడుకొని మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే.. మిలిటరీ మార్కెట్ కోసం కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌గా మానవరహిత వెర్షన్‌ను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu