వాట్సప్ మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.’కెప్ట్’ అనే కొత్త ఫీచర్ ప్రస్తుతం డెవలప్ చేయబోతోంది. ఈ ఫీచర్ డిలీట్ చేసిన మెసేజ్‌లను సేవ్ చేసుకోవచ్చు. ఈ నవీకరణ బీటా వినియోగదారులకు ఇంకా అందుబాటులో లేదు. అతి త్వరలో అందరికి అందుబాటులోకి రాబోతోంది. కొంతమంది వాట్సాప్ యూజర్లు డిలీట్ చేసిన మెసేజ్ ఫీచర్‌ని ఉపయోగిస్తున్నారు. ఇది 24 గంటలు, 7 రోజులు, 90 రోజులలో మెసెజ్‌లను ఆటో డిలీట్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా వాట్సాప్‌లో వారు పంపిన మెసేజ్‌లు వాటంతట అవే అదృశ్యమవుతాయి. వారి వ్యక్తిగత గోప్యతను కాపాడతాయి. అయితే వాట్సాప్ ఇప్పుడు ‘కెప్ట్’ అనే ఫీచర్‌ని తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఇది తొలగించబడిన మెసెజ్‌లను ఆటో సేవ్ చేస్తుంది. అటువంటి కనిపించకుండాపోయిన సందేశాలను సేవ్ చేయడానికి ‘సేవ్డ్ మెసేజెస్’ ఫీచర్ ఒక మార్గం అని చెప్పవచ్చు. దీనివల్ల వాట్సాప్‌లోని ప్రతి సందేశం అందరికీ కనిపిస్తుంది. వినియోగదారులు సందేశాలను రిజర్వ్ చేయకూడదనుకుంటే వారు వాటిని ‘అన్-రిజర్వ్’ చేయవచ్చు. మెసేజ్‌లు అన్-రిజర్వ్ చేయబడిన వెంటనే అవి చాట్‌లో కనిపించవు ఫీచర్ ద్వారా సేవ్ చేయబడిన మెసెజ్‌లు వాటి పక్కన ఉన్న బుక్‌మార్క్ సింబల్ ద్వారా గుర్తించబడతాయి. వాట్సాప్ కొత్త వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
0 Comments