Ad Code

బీఎండబ్ల్యూ నుండి ప్రత్యేక కారు!


బీఎండబ్ల్యూ ఒక ప్రత్యేక కారును ఆవిష్కరించింది. ఇది సెకన్లలో రంగులు మార్చగలుగుతుందట!. పోలీసుల పని మరింత కష్టతరం చేసే ప్రత్యేక లక్షణంతో ఒక మోడల్ కారును ఆవిష్కరించింది. దీనికి బీఎండబ్ల్యూ ఐ విజన్ డీ అని పేరు పెట్టారు. ఈ కారు సెకనులో కారు రంగులను మార్చుకోగలదు. ఇందులో ముఖ్యమైన డ్రైవింగ్ సమాచారాన్ని నేరుగా విండ్ స్క్రీన్ లోపలికి ప్రొజెక్ట్ చేసే హెడ్ అప్ డిస్ ప్లే టెక్నాలజీ ఉంది. ఈ ఫోర్ డోర్ సెలూన్ కాన్సెప్ట్ నీయో క్లాసెస్ ప్లాట్ ఫారమ్ ఫై ఆధారపడి ఉంది. ప్లగ్ ఇన్ హైబ్రీడ్, ఎలక్ట్రిక్ పవర్డ్ బీఎండబ్ల్యూ మోడళ్ల విస్తృత శ్రేణికి మద్దుతునిచ్చే సరికొత్త నిర్మాణంగా రూపొందించబడింది. 2025 వరకు ఇది రోడ్డు పైకి వస్తుందని అంచనా. నియో క్లాసెస్ ప్లాట్ ఫారమ్ పై ఆధారపడి భవిష్యత్ మోడల్స్ ఐ విజన్ డి వాయిస్ నియంత్రణ, డ్రైవింగ్ సహాయ సాంకేతికతలను దాటి డిజిటల్, వర్చువల్ ప్రపంచంలోకి తీసుకెళుతుందని సమాచారం. ఈ కారుకు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఫైజిటల్ రూపకల్పన చేశారు. హెడ్ లైట్స్ పరిమాణం, ఆకారం చేతిలో ఉన్న మన పనిని బట్టి మారుతుంది. ఇవి స్వాగత, వీడ్కోలు సందేశాలను కూడా ఫ్లాష్ చేస్తాయి. రెండు కొత్త శైలి లైట్ ప్యానెల్స్ హై సెట్ బూట్ లెడ్ లో వీలినం చేయబడ్డాయి. ఐ డివిజన్ డీ కి కొత్త టెక్నాలజీతో ఉన్న బ్యాటరీని అమర్చుతారు. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ కనుక అమ్మకం మొదలైతే కార్లలో కొత్త శకం మొదలైనట్లే!

Post a Comment

0 Comments

Close Menu