Ad Code

దేశంలో గూగుల్ పాలసీలో మార్పులు!


భారతదేశంలో కార్యకలాపాలకు సంబంధించిన పాలసీలో మార్పులు చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. పాలసీని పూర్తిగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు నుంచి ఇదివరకే ఆదేశాలు అందుకున్న గూగుల్, ఈ మేరకు చర్యలను ప్రారంభించింది. యాంటీ ట్రస్ట్ ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా  ఆదేశించిన నిబంధనల మార్పులకు గూగుల్ ఇండియా ఎట్టకేలకు అంగీకరించింది. సీసీఐ నిర్దేశించిన సూచనలకు తగినట్లుగా అనేక మార్పులను గూగుల్ లిస్ట్ అవుట్ చేసింది. గతంలో ఈ మార్పులను గూగుల్ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే, సీసీఐ మాత్రం మార్పుల విషయంలో వెనక్కి తగ్గలేదు. దేశ ప్రజల, సంస్థల డేటా ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో రాజీ పడబోమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో మార్పులను అంగీకరిస్తూ గూగుల్ ప్రకటన చేసింది. కొత్త పాలసీ ప్రకారం.. ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లు తమ ప్రిఫరెన్స్‌ అనుగుణంగా వారి డివైజ్‌ సెట్టింగ్‌లను ఛేంజ్ చేసుకోవచ్చు. ఇండియన్ యూజర్స్ ఇకపై డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌ను సెలెక్ట్ స్క్రీన్ ద్వారా ఎంపిక చేసుకోవచ్చు. ఇకపై కొనుగోలు చేసే కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌ సెటప్ సెట్టింగ్స్‌లో ఈ ఆప్షన్‌ కనిపిస్తుందని గూగుల్ ప్రకటించింది. ఓఈఎంలు తమ డివైజెస్‌లో ప్రీ-ఇన్‌స్టాలేషన్ కోసం పర్సనలైజ్డ్ గూగుల్ యాప్‌లకు లైసెన్స్ ఇస్తాయి. నాన్ కంపాటబిలిటీ లేదా ఫోర్క్ చేసిన వేరియంట్‌లను రూపొందించేందుకు పార్ట్నర్స్‌కు చేంజెస్ ఇంట్రడ్యూస్ చేసేందుకు ఆండ్రాయిడ్ కంపాటబిలిటీ రిక్వైర్‌మెంట్స్‌ను గూగుల్ అప్‌డేట్‌ చేస్తుంది. యూజర్ ఛాయిస్ బిల్లింగ్ వచ్చే నెల నుండి అన్ని యాప్‌లు, గేమ్‌లకు అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా డెవలపర్‌లు యాప్‌లో డిజిటల్ కంటెంట్‌ను కొనుగోలు చేసేటప్పుడు Google Play బిల్లింగ్ సిస్టమ్‌తో పాటు ఆల్టర్నేటివ్ బిల్లింగ్ సిస్టమ్‌ను సెలెక్ట్ చేసుకునే ఛాయిస్‌ను పొందవచ్చు. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. డెవలపర్ వెబ్‌సైట్ నుంచి నేరుగా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటుతోపాటు వివిధ సోర్స్‌ల నుంచి యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకునేందుకు Android సపోర్ట్ చేస్తుంది. అలాగే హ్యాండ్‌సెట్ మేకర్స్‌కు వారి ఛాయిస్‌ను బట్టి యాప్‌లను ప్రీ-ఇన్‌స్టాల్ చేసుకునే స్వేచ్ఛను Google ఇస్తోంది. డెవలపర్లు, యూజర్ల సౌకర్యార్థం యాప్‌లో పేమెంట్స్‌ కోసం థర్డ్ పార్టీ బిల్లింగ్ సిస్టమ్‌ను అందించవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా ఇది మంచి పద్ధతి కాదని గూగుల్ యూజర్స్‌ను సూచిస్తున్నప్పటికీ, యాప్‌ల సైడ్‌లోడింగ్‌తో Google మరింత ట్రాన్సపరెంట్‌గా మారుతోందని గూగుల్ ప్రకటించింది. ఇండియాలో ఎక్కువ మంది ఆండ్రాయిడ్ యూజర్లే ఉన్నారు. 95 శాతం కంటే ఎక్కువ డివైజ్‌లు ఇప్పుడు Android ఆధారంగానే పనిచేస్తున్నాయి. ఇంత మార్కెట్‌ను వదులుకునేందుకు గూగుల్ సిద్ధంగా లేదు. కాబట్టి, కొత్త నిబంధనలు లోబడి ఉండాలని నిర్ణయించుకుంది. దీనికి తగినట్లుగా మార్పులను అనుమతించి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu