Ad Code

మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్ సైకిల్ !


అమెరికాకు చెందిన బైసైకిల్ తయారీ కంపెనీ ఫైర్‌ఫాక్స్ తాజాగా కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ను భారత్ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ను యాప్ ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు. దీని పేరు ఫైర్‌ఫాక్స్ అర్బన్ ఎకో. జర్మన్ టెక్నాలజీ ఆధారంగా ఈ సైకిల్ రూపొందింది. ఇబైక్ డిజైన్ తయారీ కంపెనీ హెచ్ఎన్ఎఫ్ దీన్ని డిజైన్ చేసింది. ఈ ఇబైక్‌లో 10 ఏహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గంటకు 25 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ. 74,999గా ఉంది. ఇది కాస్త ఎక్కువనే చెప్పకోవాలి. ఎందుకంటే ఈ ధరలో మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లు లభిస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైసైకిల్ కేవలం గ్రే కలర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అర్బన్ ఎకో అనేది యాప్ బేస్డ్ కంట్రోల్ ఇబైక్. ఫిట్ యాప్ ద్వారా మీరు ఈ సైకిల్‌ను కంట్రోల్ చేయొచ్చు. ఈ యాప్ ద్వారా రైడర్లు వారి స్పీడ్, ఎంత దూరం ప్రయాణించారు, ఎన్ని క్యాలరీలు ఖర్చు చేశారు, హార్ట్ రేటు వంటి అంశాలు అన్నింటినీ తెలుసుకోవచ్చు. ఈ సైకిల్‌లో ఐదు పెడల్ అసిస్ట్ మోడ్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఎలక్ట్రిక్ సైకిల్‌కు సింగిల్ పవర్ బటన్ కూడా ఉంటుంది. ఈ బైక్‌ను ఫుల్‌గా చార్జ్ చేయడానికి ఐదు గంటలు పడుతుంది. కంపెనీ ట్విట్టర్ వేదికగా ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్ విషయాన్ని వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu