Ad Code

వాట్సాప్‌లో ఫార్వర్డ్ మీడియా విత్ క్యాప్షన్ ?


దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడంతో దాంతో సమానంగా వాట్సాప్ యూజర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. కేవలం నెట్ ఆధారంగానే మెసెజ్ లు పంపుకునే వెసులుబాటు ఉండడంతో వాట్సాప్ అందరి ఆదరణ పొందింది. అలాగే వాట్సాప్ ను సొంతం చేసుకున్న మెటా కూడా వినియోగదారులకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రయత్నాల్లో భాగంగా పలు ఫీచర్లను పరీక్షిస్తుంది. ఫార్వర్డ్ మీడియా విత్ క్యాప్షన్ అనే సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ లో మీడియాను ఫార్వర్డ్ చేసే సమయంలో క్యాప్షన్ ను కూడా జోడించే అవకాశం ఉండేది. ఇది మీడియా ఫైల్ అయిన ఫొటో, డాక్యుమెంట్, ఆడియో అన్నింటికి క్యాప్షన్ ను జోడించే అవకాశం ఉంది. అలాగే ఉన్న క్యాప్షన్ లను తీసేసి కూడా ఫైల్ షేర్ చేయవచ్చని తెలిపింది. ఇప్పటి వరకూ ఐఓఎస్ ఫోన్లలో ఉన్న ఈ ఫీచర్ ఇప్పుడు ఆండ్రాయిడ్ వర్షన్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. అలాగే వినియోగదారులు కూడా తమ ఫొటోలకు క్యాప్షన్ ను జోడించకుండా నియంత్రించే అవకాశం కూడా అవకాశం ఉంది. మొదటగా వాట్సాప్ ను ఓపెన్ చేయాలి. తర్వాత చాట్ లను ఎంచుకోవాలి. వాట్సాప్ లో ఉన్న కాంటాక్ట్స్ మీరు ఎవరికి మీడియా ఫైల్ పంపాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయాలి. అనంతరం మీడియా ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఫార్వర్డ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దాన్ని సెలెక్ట్ చేసిన వెంటనే చిత్రంతో క్యాప్షన్ ఎంటర్ చేసే సింబల్ కనిపిస్తుంది. అలాగే జోడించిన క్యాప్షన్ ను రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే మీరు క్యాప్షన్ తో జోడించిన మీడియా ఫైల్ ను సెండ్ చేయాలనుకుంటే ఎవ్వరికి పంపాలో సెలెక్ట్ చేసుకుని ఫార్వర్డ్ చేయాలి. అలాగే ఈ ఫీచర్ వాట్సాప్ వెబ్ లో కూడా అందుబాటులో ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu