Ad Code

బయోగ్యాస్‌ను ఇంధనంగా వినియోగించనున్న మారుతీ సుజుకీ ?


పర్యావరణాన్ని కాపాడడానికి ఆవు పేడను ఇంధనంగా ఉపయోగించాలని మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యానికి చోటివ్వకుండా 2030 నాటికి ఆరు ఎలక్ట్రికల్ వాహనాలను తీసుకురావాలని సంకల్పించిన మారుతి, అదే సమయంలో ఆవు పేడ నుంచి ఉత్పత్తయ్యే బయోగ్యాస్‌ను ఇంధనంగా వాహనాలకు వినియోగించనుంది. దీంతో భవిష్యత్తులో పెద్ద మార్పు సాధ్యమవుతుందని అంచనా వేస్తోంది. భారత దేశంలో భారీ ఎత్తున పశువుల వ్యర్ధాలు అందుబాటులో ఉంటాయని, వాటితో పెద్ద ఎత్తున బయోగ్యాస్ తయారు చేయమచ్చని మారుతీ సుజుకీ వెల్లడించింది. ఈ గ్యాస్‌ను సీఎన్జీ మోడళ్లలో వినియోగిస్తామని తెలిపింది. ఈ క్రమంలో బయో ఇంధనం ఉత్పత్తి కోసం నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు, బనాస్ డెయిరీ సంస్థలో మారుతీ ఒప్పందం చేసుకుంది.అటు ఈ కాన్సెప్టును మన దేశంలోనే కాకుండా జపాన్, ఆఫ్రికా దేశాల్లో కూడా అమలు చేయనుంది. జపాన్‌లో ఆవుపేడ నుంచి ఇంధనం తయారు చేసే ఫ్యుజిసాన్ అస్గిరి బయోమాస్ సంస్థలో మారుతి పెట్టుబడులు పెట్టింది. ఈ విధానంతో వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ తగ్గుముఖం పట్టడంతో పాటు ఆర్ధికంగా చాలా లాభించనుంది. 

Post a Comment

0 Comments

Close Menu