Ad Code

గూగుల్‌కు 100 బిలియన్ డాలర్లు నష్టం !


చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ తీసుకొస్తున్న చాట్‌బోట్ `బార్డ్‌` చేసిన చిన్న మిస్టేక్ 100 బిలియన్ డాలర్ల నష్టం మిగిల్చింది. `బార్డ్‌` ప్రమోషనల్ వీడియో ఇంటర్నెట్‌లో అప్‌లేడ్ చేశారు. జేమ్స్ వెబ్‌స్పేస్ టెలిస్కోప్ డిస్కవరీపై తొమ్మిదేండ్ల బాలుడు అడిగిన ప్రశ్నకు బార్డ్ పొరపాటు జవాబు చెప్పింది. సౌర వ్యవస్థకు బయట ఉన్న గ్రహాల చిత్రాలను జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిందని బార్డ్ చెప్పిన సమాధానం. కానీ ఇది తప్పు. 2004లోనే యూరోపియన్ యూనియన్ సదరన్ టెలిస్కోప్‌.. సూర్యుడికి వెలుపల ఉన్న గ్రహాల చిత్రాలను చిత్రీకరించింది. దీనిపై బుధవారం స్టాక్ మార్కెట్లలో గూగుల్ పేరెంట్ సంస్థ అల్ఫాబెట్ భారీ మూల్యమే చెల్లించుకున్నది. చాట్‌జీపీటీతో పోటీ పడేందుకు ఆరేండ్లపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై పని చేసిన తర్వాత గూగుల్ తన చాట్‌బోట్ `బార్డ్‌`ను ఆవిష్కరించింది. ప్రధాన అంశాలపై సమాచారాన్ని బార్డ్ అందిస్తుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన బ్లాగ్‌లో రాసుకున్నారు. బార్డ్ ప్రయోగాత్మకంగా రూపొందించిన కన్వర్జేషనల్ ఏఐ సర్వీస్‌. ఇది యూజర్ల మధ్య సంభాషణలకు గూగుల్ `లాంగ్వేజ్ మోడల్ డైలాగ్ అప్లికేషన్ (లామ్డా)` టూల్ ఆధారంగా పని చేస్తుంది. చాట్‌జీపీటీలో సాధ్యం కానీ సమాచారాన్ని వెబ్ నుంచి బార్డ్ తీసుకుని యూజర్లకు అందిస్తుందని సుందర్ పిచాయ్ తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu