Ad Code

15 న ఒప్పో మడతపెట్టే ఫోన్ విడుదల !


ఫిబ్రవరి 15 న ఒప్పో ఫైండ్ ఎన్2 ఫోన్‌ను కంపెనీ విడుదల చేయనుంది. ఒప్పో ఎ 78, ఒప్పో రెనో 8 టి తర్వాత 2023లోమొదటిసారిగా కంపెనీ ఈ గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఒప్పో ఫైండ్ ఎన్ 2 ధర రూ.82,999గా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఫోన్ డిజైన్ కస్టమర్లను ఆకట్టుకునేలా ఉంది. ఈ ఫోన్ పింక్,బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ లో ప్రత్యేకత ఏంటంటే ఫోల్డ్ చేయకుండానే నోటిఫికేషన్లు ఫొటోలు చూసేలా డిజైన్ చేశారు. 6.8 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఔటర్ డిస్‌ప్లే 3.62 అంగుళాలతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. మిడియా టెక్ ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 16 జీబీ+512 జీబీబీ వేరియంట్‌తో వచ్చే అవకాశం ఉంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా సెటప్ ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 5 జీ సపోర్ట్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 44 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4300mahబ్యాటరీ ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో పాటు ఇతర అడ్వాన్స్డ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇండియాలో 8 జీబీ + 256 జీబీ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.


Post a Comment

0 Comments

Close Menu