Ad Code

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 అల్ట్రాపై హాట్ డీల్స్‌ !


శాంసంగ్ న్యూ గెలాక్సీ ఎస్‌23 సిరీస్‌ను విడుదల చేయగా లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు డిస్కౌంట్ ఆఫర్లపై అందుబాటులో ఉన్నాయి. గెలాక్సీ ఎస్‌23 అల్ట్రాపై ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ హాట్ డీల్‌ను ప్రకటించింది. బ్యాంక్ కార్డులపై ఈ ఆకర్షణీయ ఆఫర్ లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు అమెజాన్‌పై రూ. 13,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇందులో ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 అల్ట్రా రూ. 1,24,999 నుంచి ప్రారంభమవుతుండగా హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులకు ఈ హైఎండ్ ఫోన్ రూ. 1,16,999కే లభిస్తోంది. కస్టమర్లు ఈ ఫోన్‌పై రూ. 8000 ఆఫర్‌ను పొందే వెసులుబాటు ఉంది. ఈ ధర 12జీబీ ర్యాం, 256జీబీ స్టోరేజ్ మోడల్‌కు వర్తిస్తుంది. అమెజాన్ డిస్కౌంట్ కూపన్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 రూ. 5000 ఫ్లాట్ డిస్కౌంట్‌పై అందుబాటులో ఉంది. పైన తెలిపిన బ్యాంకు కార్డులపై రూ. 8000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఈ వేరియంట్ ఒరిజినల్ ధర రూ. 79,999 కాగా ఆఫర్ కింద గెలాక్సీ ఎస్‌23ను రూ. 66,999కి లభిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu