Ad Code

వాట్సాప్ లో కాల్ షెడ్యూల్ ?


వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ విడుదలైంది.  ఈ ఫీచర్ తో యూజర్లు వాట్సాప్ నుంచి చేసే ఆడియో లేదా వీడియో కాల్స్ ను షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి ప్లాట్‌ ఫామ్స్ లో కాల్స్ షెడ్యూల్ చేసే అవకాశం వినియోగదారులకు ఉంది. ఇదే తరహాలో వాట్సాప్ కూడా కాల్ షెడ్యూలింగ్ ను యూజర్లకు పరిచయం చేసింది. వాట్సాప్ వేదిక గా ఎక్కువగా ఆన్ లైన్ కార్యక్రమాలు నిర్వహించే వారికి ఈ సరికొత్త ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్ ను ముందుగా బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వాట్సాప్ గ్రూప్ లోని సభ్యులకు ఎప్పుడు ఆడియో లేదా వీడియో కాల్ వెళ్లాలో ముందుగానే ఈ కొత్త ఫీచర్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. వీడియో, ఆడియో కాల్ ఐకాన్ పై క్లిక్ చేస్తే షెడ్యూల్‌ కాల్ అని పాప్‌-అప్‌ విండో కనిపిస్తుంది. అందులో మీటింగ్ పేరు, తేదీ, సమయం లాంటి వివరాలను ఎంటర్ చేయాలి. వివరాలన్నీ ఇచ్చిన తర్వాత క్రియేట్ పై క్లిక్ చేస్తే కాల్ షెడ్యూల్ అవుతుంది. కాల్ ప్రారంభమవ్వగానే గ్రూప్ లోని మెంబర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వాట్సాప్‌లో కొత్త కొత్త ఫీచర్లు వస్తూనే ఉన్నాయి. వాట్సాప్ ప్రతి ఏడాది అద్భుతమైన ఫీచర్లను ప్రవేశపెడుతూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఫ్యూచర్ లో వాట్సాప్ లో కాల్ రికార్డింగ్, మెసేజ్ ఎడిట్ వంటి అనేక ఫీచర్లు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. కాల్ షెడ్యూల్ ఫీచర్ తో పాటు ట్రాన్స్ క్రైబ్ వాయిస్ మెసేజెస్ పేరుతో మరో ఫీచర్ ను కూడా తెచ్చేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. ఈ ఫీచర్ విశేషం ఏంటంటే యూజర్లు వాయిస్ మెసేజ్ లను టెక్ట్స్ మాదిరి చదువుకోవచ్చు. దీంతో వాయిస్ మెసేజ్ వినలేని పరిస్థితుల్లో యూజర్లు సదరు ఆడియో ను ప్లే చేస్తే అందులో ఉన్న సమచారాన్ని టెక్ట్స్ రూపంలో స్క్రీన్ పై చూపిస్తుంది. త్వరలోనే ఈ ఫీచర్ ను వాట్సాప్ యూజర్లకు పరిచయం చేయనుంది. ఇంతకుముందు ఒకేసారి 100 మీడియా ఫైల్స్ ను షేర్ చేసేలా యాప్ ను అప్ డేట్ చేసింది వాట్సాప్. ప్రైవేట్ ఆడియన్స్ సెలెక్టర్, వాయిస్ స్టేటస్, స్టేటస్ రియాక్షన్స్, స్టేటస్ ప్రొఫైల్, లింక్ ప్రివ్యూ ఫీచర్స్‌ వంటి వాటిని పరిచయం చేసింది. వాటితో పాటు మరో సరికొత్త ఫీచర్ ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ లో ఒకేసారి 100 మీడియా ఫైల్స్ ను షేర్ చేసుకునే వీలు కల్పించింది. ఇంతముందు వాట్సాప్ లో 30 మీడియా ఫైల్స్ మాత్రమే షేర్ చేసే వీలుంది. ఇపుడు అది 100 కు పెంచుతూ వాట్సాప్ నిర్ణయం తీసుకుంది.

Post a Comment

0 Comments

Close Menu