Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Saturday, February 11, 2023

ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్ !

ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్ నిర్వహిస్తోంది. ఈ మెగా సేల్ ఈవెంట్‌లో ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 13పై బంపరాఫర్స్ ప్రకటించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 13పై రూ.7,901 డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్ ధర రూ.61,999కు తగ్గింది. అంతేకాకుండా ఐఫోన్ 13 పై మరికొన్ని డీల్స్‌ను ఆఫర్ చేస్తోంది. HDFC బ్యాంక్ క్రెడిట్ నాన్ EMI, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై ఈ ఫోన్ కొంటే అదనంగా రూ. 2,000 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో iPhone 13 ధర రూ.59,999కు తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 13 ఎక్ఛేంజ్ ఆఫర్ కూడా ప్రకటించింది. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్ఛేంజ్ చేస్తే రూ. 23,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అన్ని ఆఫర్స్, బ్యాంక్ డిస్కౌంట్స్‌తో ఐఫోన్ 13ను కేవలం రూ. 36,999కు సొంతం చేసుకోవచ్చు. యాపిల్ కంపెనీ ఐఫోన్ 13 సిరీస్‌ను 2021లో ప్రపంచవాప్తంగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో ఐఫోన్13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్13 మినీ మోడల్స్ తీసుకొచ్చింది. ఐఫోన్ 13 బేస్ వేరియంట్ (128GB) ధర రూ.79,900, మిడ్ వేరియంట్(256GB) ధర రూ. 89,900, ఇక హై-ఎండ్ వేరియంట్ ధర రూ.99,900. ఐపోన్ 13ను పింక్, బ్లూ, మిడ్‌నైట్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ రెడ్ వంటి ఐదు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఐఫోన్ 13 సిరీస్ స్పెసిఫికేషన్స్ ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లోనే వచ్చిన ఐఫోన్ 14 సిరీస్‌కు దాదాపు సమానంగా ఉంటాయి. అయితే ధర విషయంలో చాలా వ్యత్యాసం ఉంది. ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్‌లో ఐఫోన్ 13ను మిడ్ రేంజ్‌ ధరలోనే సొంతం చేసుకోవచ్చు.

No comments:

Post a Comment

Popular Posts