స్వదేశీ ఫైనాన్షియల్ టెక్ కంపెనీ వెలాసిటీ ‘లెక్సీ’ పేరిట ఇండియాలో మొట్ట మొదటి ఏఐ చాట్‌బాట్‌ను లాంచ్ చేసింది. ఓపెన్ ఏఐ కంపెనీ డెవలప్ చేసిన చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్‌తో ఈ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వెలాసిటీ ఇన్‌సైట్‌లను ఉపయోగిస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్‌యాప్ వాట్సాప్ ఇంటర్‌ఫేస్‌లో చాట్‌జీపీటీని ఇంటిగ్రేట్ చేసింది. తద్వారా ఈ-కామర్స్ వ్యాపారులకు వారి వ్యాపారాలపై విశ్లేషణలు, రోజువారీ వ్యాపార నివేదికలు పంపిస్తుందనీ, క్లిష్టమైన వ్యాపార విధుల కోసం సమయాన్ని ఖాళీ చేస్తుందని కంపెనీ తెలిపింది. లెక్సీ ప్రారంభించినప్పటి నుండి వెలాసిటీ ఇన్‌సైట్స్ తమ బ్రాండ్ ఆదాయాన్ని మార్కెటింగ్ ఖర్చులను పర్యవేక్షించడంలో సహాయపడిందని నేచర్‌ప్రో సీఈవో, పౌండర్ వ్యవస్థాపకుడు మోహిత్ మోహపాత్ర ఒక ప్రకటనలో తెలిపారు.
వెలాసిటీ ‘లెక్సీ’ ఏఐ చాట్‌బాట్ విడుదల
0
February 14, 2023
Tags