Ad Code

లేఆఫ్స్‌లో పెర్ఫామెన్స్‌నూ పట్టించుకోని గూగుల్ !


మెరుగైన పనితీరు కనబరిస్తే లేఆఫ్స్ భయం ఉండదని, సరైన సామర్ధ్యం కొరవడిన వారిపైనే వేటువేస్తారనే అభిప్రాయం అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. గూగుల్ ఇండియా  ఉద్యోగి లింక్డిన్ పోస్ట్ ఇదే విషయం స్పష్టం చేస్తోంది. ఆ పోస్ట్ వివరాల ప్రకారం సామర్ధ్యం ఆధారంగా లేఆఫ్స్ చోటుచేసుకోలేదు. అత్యధిక సామర్ధ్యం కనబరిచి హయ్యస్ట్ రేటింగ్ కలిగిన వారిని కూడా కంపెనీ విధుల నుంచి తొలగించింది. గూగుల్ లేఆఫ్స్ సామర్ధ్యం ప్రాతిపదికన జరగలేదని ఆ ఉద్యోగి స్పష్టం చేశారు. గూగుల్ ఇండియా భారత్‌లో ఇటీవల 450 మందిని తొలగించగా ఈ లేఆఫ్స్ పెర్ఫామెన్స్ ఆధారంగా జరగలేదని చెప్పుకొచ్చారు. కొలువులు కోల్పోకుండా కంపెనీలో కొనసాగగలిగిన (నాతో సహా) వారంతా లేఆఫ్స్ బాధితుల కంటే మెరుగైన సామర్ధ్యం కలిగిఉండాల్సిన అవసరం లేదని లింక్డిన్ పోస్ట్‌లో సదరు ఉద్యోగి రాసుకొచ్చారు. అధిక రేటింగ్స్‌తో ఇటీవల పదోన్నతులు పొంది తనకు పరిచయమున్న వారు సైతం ఇటీవలి లేఆఫ్స్‌లో కొలువులు కోల్పోయారని ప్రస్తావించారు. 15 ఏండ్లకు పైగా గూగుల్‌లో పనిచేస్తున్న మహిళ ఓ రోజు ఉదయం లేస్తూనే అనూహ్యంగా  తన ఉద్యోగం కోల్పోయిన విషయం తెలుసుకున్నట్టు వెల్లడించారు. 

Post a Comment

0 Comments

Close Menu