Ad Code

అద్దెకు స్మార్ట్‌ఫోన్లు !


ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారు స్మార్ట్‌ఫోన్స్‌ను అద్దెకు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఎక్కువ డబ్బులు పెట్టి ఫోన్ కొంటే ఒక నెల కల్లా అది పాతది అవుతుంది. లేదంటే టైమ్ బాగులేకపోతే పగిలిపోవచ్చు.  ఇలాంటివి ఏమీ లేకుండా మీరు అద్దెకు స్మార్ట్‌ఫోన్ తీసుకుంటే.. మీకు నచ్చినన్ని రోజులు వాడుకోవచ్చు. తర్వాత వెనక్కి ఇవ్వొచ్చు. ఫోన్లను అద్దెకు ఇవ్వడానికి రెంట్ మోజో అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఒకటి ఉంది. ఇది యూజర్లకు అద్దెకు స్మార్ట్‌ఫోన్స్, యాపిల్ ఫోన్లను అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 ప్లస్, యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్, యాపిల్ ఐఫోన్ 11 ప్రో, వన్‌ప్లస్ 7, రెడ్‌మి కే20 ప్రో, శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, యాపిల్ ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, వన్‌ప్లస్ 7 ప్రో, యాపిల్ ఐఫోన్ ఎక్స్, ఒప్పొ ఎఫ్11 ప్రో, గూగుల్ పిక్సెల్ 2 వంటి పలు మోడళ్లను మీరు అద్దెకు తీసుకోవచ్చు. ఎంచుకునే స్మార్ట్‌ఫోన్ ప్రాతిపదికన మీ నెలవారీ అద్దె కూడా మారుతుంది. అందువల్ల ఈ విషయం గుర్తించుకోవాలి. ఉదాహరణకు రెడ్‌మి కే 20 స్మార్ట్‌ఫోన్ అద్దెకు తీసుకోవాలని భావిస్తే నెలకు రూ. 649 చెల్లించాలి. రెడ్‌మి కే20 ప్రో మోడల్ రెంట్‌కు తీసుకోవాలని చూస్తే.. నెలకు రూ. 829 కట్టాలి. అయితే మీరు దీని కోసం ముందుగా రూ. 2149 డిపాజిట్ చేయాలి. ఇది మీకు మళ్లీ రిఫండ్ చేస్తారు. 12 నెలలకు రెంట్‌కు తీసుకుంటే నెలకు రూ. 829 పడుతుంది. మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన కూడా రెంట్ మారుతూ ఉంటుంది. అదే మీరు ఐఫోన్ ఎక్స్ఆర్ మోడల్ రెంట్‌కు తీసుకోవాలని భావిస్తే.. నెలకు రూ. 1639 నుంచి కట్టాలి. 12 నెలలకు ఇది వర్తిస్తుంది. రిఫండబుల్ అమౌంట్ రూ. 4249 చెల్లించాలి.

Post a Comment

0 Comments

Close Menu