Ad Code

ప్రీమియం లాప్‌టాప్‌ల తయారీకి శాంసంగ్ నిర్ణయం


దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ భారత్‌లోనే ప్రీమియం లాప్‌టాప్‌లు తయారు చేయాలని నిరాయించింది. శాంసంగ్‌ గణనీయ స్థాయిలో దేశీయంగా లాప్‌టాప్‌లను ఉత్పత్తి చేసి, విక్రయిస్తే సంస్థలకు కేంద్రం కల్పిస్తున్న ఇన్సెంటివ్ స్కీం వర్తిస్తుంది అని శాంసంగ్ వైస్‌ప్రెసిడెంట్ మిన్‌చోల్ లీ తెలిపారు. పలు కారణాల రీత్యా భారత్ మార్కెట్ మాకు ముఖ్యం. భారత్ మార్కెట్‌లో `మేడిన్ ఇండియా` ఇన్సియేటివ్ ముఖ్యమైందని మేం అర్థం చేసుకున్నాం. అందువల్లే మా గెలాక్సీ ఫోన్ల ఉత్పత్తి భారత్‌లోనే చేస్తున్నాం` అని మిన్‌చోల్ లీ చెప్పారు. `ఇతర మార్కెట్లలో మాదిరిగానే భారత్‌లోనూ గణనీయ స్థాయిలో ఉత్పత్తి, విక్రయాలు చేయగలిగితే తప్పనిసరిగా భారత్‌లోనే లాప్‌టాప్‌లను ఉత్పత్తి చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం` అని అన్నారు. ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల కోసం గతేడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం `ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్‌` స్కీమ్ తీసుకొచ్చింది. కానీ అంతగా సంస్థలను ఆకట్టుకోలేకపోయింది. కేంద్రం స్కీమ్‌లో తక్కువ ఇన్సెంటివ్‌ల వల్లే కంపెనీలను ఆకట్టుకోలేకపోయిందని హార్డ్‌వేర్ తయారీ సంస్థలు పేర్కొన్నాయి. హార్డ్‌వేర్ ఉత్పత్తులకు కేంద్రాలుగా ఉన్న చైనా, వియత్నాం నుంచి తమ యూనిట్లను భారత్‌కు తరలించినా.. ఇన్సెంటివ్ స్కీమ్ ఆకర్షణీయంగా లేదని ఆక్షేపించాయి. హార్డ్‌వేర్ కంపెనీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌ను ఈ దఫా ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నది. గతంతో పోలిస్తే రెండున్నర రెట్లు నిధులు సుమారు రూ.19 వేల కోట్లు కేటాయించింది. తద్వారా డెల్‌, హెచ్‌పీ, ఆపిల్‌, శాంసంగ్‌, అసుస్ వంటి బహుళ జాతి సంస్థలను ఆకర్షించడానికి ఏర్పాట్లు చేస్తున్నది.

Post a Comment

0 Comments

Close Menu