Ad Code

ఇండియానూ తాకిన గూగుల్‌ లేఆఫ్స్‌ !


అమెరికాకు చెందిన టెక్‌ దిగ్గజం గూగుల్‌ భారత్‌లో దాదాపు 453 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు గురువారం రాత్రి వారికి ఈమెయిల్‌ ద్వారా సమాచారం ఇచ్చింది. గూగుల్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ గుప్తా ఈ మేరకు ఉద్యోగులకు ఈమెయిల్‌ పంపినట్లు తెలుస్తోంది. మారిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు గూగుల్‌ గత నెల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెరికాలోని ఉద్యోగులకు సమాచారం ఇచ్చామని, ఇతర దేశాల్లో వారికి త్వరలోనే సమాచారం అందుతుందని సీఈఓ సుందర్‌ పిచాయ్‌ అప్పట్లో పేర్కొన్నారు. అయితే, గూగుల్‌ ప్రకటించిన ఈ భారీ లేఆఫ్‌ల ప్రక్రియలో భాగంగానే భారత్‌లో 453 మందిని తొలగించారా? దానికి అదనమా? అనేది స్పష్టత రాలేదు. సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసినా తనను తొలగించారని ఓ అకౌంట్‌ మేనేజర్‌ తన ఆవేదనను లింక్డిన్‌లో వెళ్లగక్కాడు. ఇలాగే వందల మందిని ఫర్మామెన్స్‌తో సంబంధం లేకుండా తొలగింపులు చేస్తున్నట్లు ఉద్యోగస్తులు ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu