Ad Code

టాటా హారియర్ కారు బుకింగ్ ప్రారంభం


దేశీయ మార్కెట్లోకి రానున్న 2023 టాటా హారియర్ కారు బుకింగ్‌లను ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ఫంక్షనాలటీ, న్యూ జనరేషన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రియల్ వంటి అనేక ఫీచర్లతో అప్‌గ్రేడ్ అయింది. డ్రైవింగ్ ఎమిషన్నిబంధనలు-కస్టమ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. పాత హారియర్ కారు మోడల్ ధర రూ. 15 లక్షల నుంచి రూ. 22.60 లక్షల (ఎక్స్-షోరూమ్)లో ఉండగా, కొత్త హారియర్ ధర రూ. 15.50 లక్షల నుంచి ప్రారంభమై రూ. 24 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు. టాటా హారియర్ 2023 మోడల్ MG హెక్టర్ 2023 జీప్ కారుకంపాస్‌లతో తలపడనుంది. కొత్త హారియర్ ఎక్స్‌టీరియర్ పార్టులో ఎలాంటి అప్‌డేట్స్ అందించలేదు. OMEGA ఆర్కిటెక్చర్ ఆధారంగా ఇంపాక్ట్ డిజైన్ 2.0 ఫిలాసఫీ, SUV HID ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్‌ల్యాంప్‌లు, 17-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, పనోరమిక్ సన్‌రూఫ్‌లతో వస్తుంది. కొత్త హారియర్ క్యాబిన్ లోపల డాష్‌బోర్డ్‌లో వైడ్ ఓక్ బ్రౌన్ ట్రీట్‌మెంట్ అందిస్తుంది. బెనెక్-కలికో ఓక్ బ్రౌన్ సీట్ అప్హోల్స్టరీ క్యాబిన్‌కు అదనపు ప్రీమియంను అందిస్తుంది. కొత్త 10.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ యాడ్ చేసింది. వైర్‌లెస్ Apple CarPlay, Android Autoకి సపోర్టు ఇస్తుంది. iRA కనెక్ట్ ద్వారా కార్ టెక్నాలజీ వాహన భద్రత, వాహన నిర్ధారణ, లొకేషన్ సర్వీసులు, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లకు సంబంధించిన అనేక కనెక్టివిటీ ఫీచర్‌లను అందిస్తుంది. SUV కొత్త 7-అంగుళాల డిజిటల్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందిస్తుంది. 2023 టాటా హారియర్‌కు అతి ముఖ్యమైన ఫీచర్ ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై బీమ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్ చేంజ్ అలర్ట్, డోర్ ఓపెన్ అలర్ట్, రియర్ క్రాస్ వంటి ఫీచర్లతో వస్తుంది. అంతేకాదు.. ట్రాఫిక్ వార్నింగ్, బ్యాక్ హిట్టింగ్ వార్నింగ్ ఫీచర్లతో పాటు అదనంగా 360-డిగ్రీ కెమెరా ఉంది. టాటా మోటార్స్ రాబోయే RDE నిబంధనలకు అనుగుణంగా 2023 హారియర్ ఇంజిన్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసింది. 2.0-లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 170PS పవర్, 350Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ MT లేదా 6-స్పీడ్ ATతో యాడ్ చేసే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu