Ad Code

ఏఐ, మల్టీ క్లౌడ్ లదే భవిష్యత్ !


భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మల్టీ క్లౌడ్, క్వాంటం కంప్యూటింగ్ , సస్టైనబిలిటీని 2023లో మార్పుకు ప్రధాన డ్రైవర్స్ గా గుర్తిస్తుంది. 2023 డిజిటల్‌ రంగంలో వచ్చే మార్పును ముందుండి నడిపించేవి కృత్రిమ మేధ (ఏఐ), మల్టీ క్లౌడ్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ లేనని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ తాజా నివేదికలో వెల్లడించింది. టెక్‌ ట్రెండ్స్‌ 2023 పేరుతో వచ్చిన ఈ నివేదికలో పలు విషయాలను వెల్లడించింది. 5జీ అప్లికేషన్స్ లీడ్ లో ఉండనున్నాయి. భవిష్యత్ లో టెలికాం కంపెనీలకు, కార్పొరేట్లకు మధ్య భాగస్వామ్యాలు పెరుగుతాయి. దీని వల్ల 5జీ అప్లికేషన్లు భారీగా పెరుగుతాయని తెలిపింది. ఈ ఏడాదిలో గమనించదగ్గ 10 టెక్నలాజికల్ ట్రెండ్స్ ను గుర్తించామని .. భవిష్యత్తుకు సిద్ధం కావడానికి కంపెనీలకు అవి ఉపయోగపడతాయి. 2023 లో ఏఐ, మల్టీ క్లౌడ్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, సస్టెయినబిలిటీ అప్లికేషన్లు కీలకంగా మారనున్నాయి. ఇవి డిజిటల్‌ రంగంలో పెను మార్పులకు దోహదం పడతాయి. ఈ ఏడాదిలో ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం భారీ స్థాయిలో జరుగనుంది. చాట్‌బాట్స్‌ నుంచి చిప్‌ పరిశ్రమలో హార్డ్‌వేర్‌ తయారీ వరకు ఏఐ ముందుంటుంది. రానున్న రోజుల్లో మల్టీ క్లౌడ్‌ కూడా జోరందుకుంటుంది. ప్రభుత్వ, పరిశ్రమ క్లౌడ్‌లు పెరుగుతాయి. 2027 నాటికి కార్పొరేట్లలో సగం మంది క్లౌడ్‌ సొల్యూషన్లను వినియోగిస్తారు. 5జీ, ఏఐ, ఎక్స్‌టెండెడ్‌ రియాల్టీ వంటి సాంకేతికతలతో కంపెనీలు తమను తాము పునర్‌ నిర్వచించుకుంటాయి. పర్యావరణహిత మార్గంలోకి వెళ్లేందుకు సాంకేతికతను కంపెనీలు ఎక్కువగా వినియోగించుకుంటాయి. ఉద్యోగులకు అనువుగా ఉండే ధోరణులు పెరుగుతాయి. ఇందుకూ సాంకేతికతే ఉపయోగపడుతుందన్నది అంతర్జాతీయంగా సగం మంది హెచ్‌ఆర్‌ నిపుణులు చెబుతున్న మాట. వినూత్న సాంకేతికతలు మెరుగైన అనుభవాన్ని ఇస్తాయి. నియామకాల నుంచి నైపుణ్యాల పెంపు వరకు ఇవి కనిపిస్తాయి. రాబోయే ఏళ్లలో సమన్వయ రోబో లేదా కోబోట్స్‌ రాణిస్తాయి. మనుషుల్లో భావోద్వేగాలను గుర్తించి అందుకు తగ్గట్లుగా స్పందించే కంప్యూటేషనల్‌ ఎంపథీతో ఇవి పనిచేయనున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu