Ad Code

నాన్‌ బ్లూ ట్విట్టర్‌ యూజర్లకు టూ-ఫాక్టర్ సెక్యూరిటీ ఫీచర్‌ ఉండదు !


మార్చి 20 నుంచి నాన్‌- బ్లూ సబ్‌స్క్రైబర్లు అందరూ టూ-ఫాక్టర్ సెక్యూరిటీ ఫీచర్‌ను కోల్పోతారని ట్విట్టర్ ప్రకటించింది. ట్విట్టర్‌ బ్లూ సేవల కోసం ఇండియాలో నెలకు రూ.900 చెల్లించాలి. ఈ మొత్తం చెల్లించని వారు ఎస్.ఎం.ఎస్  టూ- ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ ద్వారా ట్విట్టర్‌ అకౌంట్‌ను సెక్యూర్‌ చేసుకోలేరు. ఎలాన్‌ మస్క్‌ నిర్ణయంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే చాలా మంది భద్రతా నిపుణులు ఈ విషయాన్ని మిలియన్ల మంది ట్విట్టర్ వినియోగదారులకు అంత భారమేమీ కాదని భావిస్తున్నారు. ట్విట్టర్‌ బ్లూ సేవల పొందడానికి సబ్‌స్క్రైబ్‌ చేసుకునే ఉద్దేశం లేని వారు ఇతర మార్గాలలో ట్విట్టర్‌ అకౌంట్‌ను సెక్యూర్‌ చేసుకోవచ్చు. టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను అందించే వివిధ ఆప్షన్‌లు ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్నాయి. అత్యంత సురక్షితమైన ఆప్షన్‌ కాని SMS ఉపయోగించే బదులు, మీరు మీ అకౌంట్‌లకు మెరుగైన భద్రతను అందించే అథెంటికేటర్‌ యాప్‌కి మారవచ్చు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, Authy వంటి దిగ్గజ కంపెనీల యాప్‌లతో కనెక్ట్‌ కావడానికి ఈ యాప్‌పై ఆధారపడవచ్చు. వినియోగదారులు తమ అకౌంట్‌లను సురక్షితంగా ఉంచుకోవడానికి పాస్‌వర్డ్ మేనేజర్‌లను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. ట్విట్టర్‌లో బెదిరింపులు వంటివి రాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. SIM కార్డ్‌లను క్లోనింగ్ చేయడం లేదా మార్పిడి చేయడం ద్వారా SMS అథెంటికేషన్‌ మార్చగల వ్యక్తులు కూడా ఉన్నారని, వారిని అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu