Ad Code

సూపర్ ఫీచర్స్‌తో గూగుల్ మ్యాప్స్‌ !


గూగుల్ మ్యాప్స్‌ మరో కొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. ఇమ్మెర్సివ్ వ్యూ అనే కొత్త ఫీచర్‌తో అందరినీ అట్రాక్ట్ చేయాలని గూగుల్ అనుకుంటోంది. దీనికి సంబంధించిన అప్ డేట్‌ను పారిస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ ప్రకటించింది. మొదట ఐదు ముఖ్య నగరాల్లో దీన్ని తీసుకొస్తున్నామని త్వరలోనే మిగిలిన అన్ని నగరాలకు కూడా ప్రవేశపెడతామని చెప్పింది. ఇమ్మెర్సివ్ వ్యూ విషయానికి వస్తే గూగుల్ మ్యా్ప్స్‌లో మనకు కావల్సిన ప్రదేశాన్ని మరింత స్పష్టంగా చూపించడమే దీని ప్రత్యేకత. మామూలు వ్యూ పీచర్‌లాగే కనిపించినప్పటికీ ఇందులో స్ట్రీట్ వ్యూ, ఏరియల్ ఇమేజస్‌తో వర్చువల్ వరల్డ్ మోడల్‌ను అందించనుంది. అలాగే ట్రాఫిక్, లోకేషన్ ఎంత బిజీగా ఉంది అనే వివరాలు కూడా ఉంటాయి. ఇది కాకుండా మరికొన్ని రోజుల్లో ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ల్లో గ్లాన్సబుల్ డైరెక్షన్స్ అనే కొత్త ఫీచర్ కూడా వస్తుందని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతానికి లండన్, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, టోక్యో నగరాల్లో ఇమ్మెర్సివ్ వ్యూను తీసుకొచ్చింది. అలాగే ఆమ్స్టర్‌డమ్, డబ్లిన్, ఫ్లోరెన్స్, వెనిస్‌లతో సహా మరిన్ని నగరాలకు ఈ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. దీనివల్ల ఆ నగరాల గురించి ముందే తెలుసుకుని, అక్కడ విజిట్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెబుతోంది. ఈ ఫీచర్‌లోని అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా కంప్యూటర్ వ్యూలో డిజిటల్ వరల్డ్‌ని కూడా చూడొచ్చని చెప్పింది. ఇది మరింత నేచురల్‌గా కనిపించడానికి మామూలు పిక్స్‌ని కూడా 3డి ఇమేజ్‌లోకి మార్చే కొత్త ఏఐ టెక్నాలజీ అయిన న్యూరల్ రేడియన్స్ ఫీల్డ్‌లను ఉపయోగిస్తున్నామని గూగుల్ తెలిపింది. ఇమ్మెర్సివ్ వ్యూ వల్ల దేన్ని అయితే చూస్తున్నామో వర్చువల్‌గా అక్కడ ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుందని చెబుతోంది గూగుల్.అలాగే దానికి దగ్గరలో ఉన్న ఏటీఎం, రెస్టారెంట్, పార్క్, లాంజ్, టాక్స్ స్టాండ్, రెంటల్ కార్స్, ట్రానిట్ స్టేషన్స్ లాంటి వాటి గురించి తెలుసుకోవడానికి దీనితో పాటు మరో ఫీచర్‌ను కూడా యాడ్ చేసింది. ఏఐ, అగ్మెంటెడ్ రియాలిటీ సాయంతో తయారుచేసిన సెర్చ్ విత్ లైవ్ వ్యూ గురించి కూడా ఒక బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ తెలిపింది. దీనిలో లండన్, మ్యాడ్రిడ్, మెల్ బోర్న్, పారిస్, ప్రేగ్, సావో పాలో, సింగపూర్, సిడ్నీ, తైపీ లాంటి నగరాల్లో వెయ్యి కొత్త ఎయిర్ పోర్ట్‌లు, రైల్వేస్టేషన్లు, మాల్స్ లాంటి వివరాలను రానున్న నెలల్లో అందిస్తామని చెప్పింది.

Post a Comment

0 Comments

Close Menu