Ad Code

వాట్సాప్‌లో లాంగ్‌ వాయిస్‌ మెసేజ్‌లు ?


ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌కు 2 బిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. 2021 సెప్టెంబర్‌లో WabetaInfo విడుదల చేసిన ఓ నివేదికలో.. వాయిస్ నోట్‌లను ట్రాన్స్‌స్క్రైబ్‌ చేయడానికి కొత్త ఫీచర్‌ అందించే ప్రయత్నాల్లో ఉందని తెలిపింది. ఈ ఫీచర్‌ ద్వారా వాయిస్‌ మెసేజ్‌లోని కంటెంట్‌ సక్రమంగా వినలేనప్పుడు చదివే అవకాశాన్ని కల్పిస్తుందని పేర్కొంది. అప్పట్లోనే ఈ ఫీచర్‌ అందించే లక్ష్యంతో పని చేస్తున్న వాట్సాప్‌.. కొన్ని అనివార్య కారణాలతో పక్కనపెట్టింది. ఎట్టకేలకు ప్రస్తుతం ఈ ఫీచర్‌ను మళ్లీ వాట్సాప్‌ కంపెనీ పట్టాలెక్కించింది. త్వరలోనే వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్‌ బీటా అప్‌డేట్‌ iOS 23.3.0.73లో వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్టింగ్ ఫీచర్‌పై కంపెనీ తిరిగి పని చేస్తున్నట్లు WabetaInfo గుర్తించింది. ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్‌ చేసింది. అందులో ట్రాన్స్‌క్రిప్షన్ ఎప్పుడు అందుబాటులో ఉండదు అనే అంశాలను వివరించే ఇంట్రడక్షన్‌ స్క్రీన్‌ కనిపిస్తోంది. లాంగ్వేజ్‌ డిఫరెంట్‌గా సెట్‌ చేసినప్పుడు, వాయిస్‌ నోట్‌లో ఎలాంటి స్పీచ్‌ లేనప్పుడు ట్రాన్స్‌క్రిప్టింగ్‌ ఫీచర్‌ పని చేయదని వివరిస్తోంది. ట్రాన్స్‌క్రిప్షన్‌లు డివైజ్‌లోనే జరుగుతాయి. అందుకు అవసరమైన లాంగ్వేజ్‌ ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ లేదా యాపిల్‌ కంపెనీతో షేర్‌ కావు. యూజర్లకు మాత్రమే వాయిస్ నోట్స్‌లోని కంటెంట్‌లకు యాక్సెస్‌ ఉంటుంది. అయితే ఈ ఫీచర్ ఐఫోన్‌లో మోస్ట్‌ రీసెంట్‌ iOS వెర్షన్‌లలో మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వినియోగదారులు గమనించాలి. రాబోయే అప్‌డేట్‌లో ఈ లేటెస్ట్‌ ఫీచర్‌ను వాట్సాప్‌ అందించే సూచనలు ఉన్నాయి. అదే విధంగా వాట్సాప్ డాక్యుమెంట్స్‌ను సెండ్‌ చేసే సమయంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తోంది. స్టేటస్ అప్‌డేట్‌ల కోసం కొన్ని అద్భుతమైన ఆప్షన్‌లను కూడా యాడ్‌ చేస్తోంది. వాట్సాప్‌ స్టేటస్‌లో వాయిస్‌ మెసేజ్‌లు షేర్‌ చేసుకునే సదుపాయం అందించింది. కొత్తగా యాడ్‌ చేసిన ఆప్షన్స్‌ను ఎంజాయ్‌ చేయాలంటే వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu