Ad Code

యూట్యూబ్ కొత్త సీఈఓగా నీల్ మోహన్


సుదీర్ఘకాలంగా యూట్యూబ్‌లో ఎగ్జిక్యూటివ్‌గా కొనసాగుతున్న నీల్ మోహన్ ఇప్పుడు అదే సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టడం విశేషం. కాగా స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌ పూర్తిచేసిన ఆయన 2008లో గూగుల్‌లో చేరారు. 2015లో యూట్యూబ్ చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించి యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ మ్యూజిక్, ప్రీమియం, షార్ట్స్‌తో సహా పలు భారీ 'ప్రాడక్టులను' లాంచ్ చేశారు. మోహన్ 1996లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. అక్కడ అతను అర్జయ్ మిల్లర్ స్కాలర్. ఆ తర్వాత నీల్ 2005లో స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ(MBA) పట్టా పొందాడు. 1996లో తొలత యాక్సెంచర్‌తో తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత నెట్ గ్రావిటీ అనే స్టార్టప్ కంపెనీలో చేరారు. గూగుల్‌లో చేరిన తర్వాత ర్యాంకుల ద్వారా త్వరగా ఎదిగాడు. మోహన్ బాధ్యతలు చేపట్టిన తరుణంలో ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీల్లో చీఫ్‌గా ఉన్న భారత సంతతి వ్యక్తుల జాబితాలోకి చేరారు. ఇప్పటికే ఇండియన్ అమెరికన్లు సుందర్ పిచాయ్ గూగుల్, దాని మాతృ సంస్థ అల్ఫాబెట్‌కు సీఈఓగా ఉండగా సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌, అర్వింద్ కృష్ణ ఐబీఎం, శాంతను నారాయణ్ అడోబ్ కంపెనీలకు ముఖ్య కార్యనిర్వహణ అధికారులుగా ఉన్నారు. గూగుల్‌లో సుసాన్ 16వ ఉద్యోగిగా చేరారు. 25 సంవత్సరాలుగా ఆమె యూట్యూబ్‌లో పని చేస్తున్నారు. గూగుల్ కో ఫౌండర్లు లారీ పేజ్, సెర్జీ బ్రిన్‌కు తన తల్లిదండ్రుల ఇంట్లో గ్యారేజ్ స్పేస్ రెంట్‌కు ఇచ్చి 1998లో గూగుల్ ప్రారంభించేందుకు దోహదపడ్డారు. 2014లో ఈ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఇక సుసాన్ వైదొలగడంతో యూట్యూబ్‌లో ఒక శకం ముగిసిందనే చెప్పాలి. ఈమెకు యూట్యూబ్, గూగుల్‌లో సుదీర్ఘ అనుభవం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu