Header Ads Widget

Huawei స్మార్ట్ వాచ్ లో ఇయర్ బడ్స్ !


ఇయర్‌బడ్స్‌ని వెంట తీసుకెళ్లడం మర్చిపోతే, Huawei వాచ్ బడ్స్ బాగా ఉపయోగపడవచ్చు. ఈ కొత్త స్మార్ట్‌వాచ్ సాధారణ స్మార్ట్‌వాచ్‌ను పోలి ఉంది. కాకపోతే ఇది 2-ఇన్-1 టైపు. వాచ్‌లోనే ఇయర్ బడ్స్ కూడా ఉంటాయి. 1.43 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీన్ని తెరవగానే లోపల ఉన్న వైర్‌లెస్ TWS ఇయర్‌బడ్‌లు బయటకు వస్తాయి. ఇవి చిన్నగా ఉంటాయి. ఈ స్మార్ట్‌వాచ్‌లో.. ఇతర స్మార్ట్‌వాచ్ లలో లభించే అన్ని రకాల ఫీచర్లూ లభిస్తాయి. హార్ట్ రేట్ ట్రాకర్, స్లీప్ ట్రాకర్, బ్లడ్ ఆక్సిజన్ ట్రాకర్ వంటివి ఉన్నాయి. దుమ్ము, వాటర్ ప్రూఫ్ కలిగివుంది. ఇందుకోసం దీనికి IPX7 రేట్ ఉంది. ఇయర్ బడ్స్‌కి IPX4 రేట్ ఉంది. Huawei యొక్క వాచ్ బడ్స్‌ని Huawei Health Connect యాప్ ద్వారా Android లేదా iOSకి కనెక్ట్ చేయవచ్చు. ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లలో... ఏ ఇయర్‌బడ్‌ను ఏ చెవిలో పెట్టుకున్నా... అవి ఆటోమేటిక్‌గా గుర్తిస్తాయి. ఆ ప్రకారం బడ్స్‌లోని వాల్యూమ్ సర్దుబాటు అవుతుంది. ట్రిపుల్ అడాప్టివ్ ఈక్యూ ఫీచర్‌ను కలిగివుంది. ఫలితంగా ప్రత్యేక సెన్సార్‌లు, అంతర్నిర్మిత మైక్రోఫోన్‌ల ద్వారా ఆడియో నాణ్యతను ఆప్టిమైజ్ చేస్తుంది. AI నాయిస్ క్యాన్సిలేషన్ కాలింగ్, వేర్ డిటెక్షన్ టెక్నాలజీ కూడా ఈ బడ్స్‌లో ఉంది. దీంతో పాటు, సైన్ సపోర్ట్ ఫీచర్‌ కూడా ఉంది. ఈ వాచ్‌లో 410 mAh బ్యాటరీ ఉంది. అలాగే ప్రతీ బడ్‌లో 30 mAh బ్యాటరీ ఉంది. ఈ బడ్స్ ANC ఆన్‌లో ఉన్నప్పుడు 3 గంటల పాటు పనిచేస్తాయి. అ

Post a Comment

0 Comments